నాని – ఇంద్రగంటి ‘హ్యాట్రిక్’?


నాని - ఇంద్రగంటి 'హ్యాట్రిక్'?

నాని – ఇంద్రగంటి ‘హ్యాట్రిక్’?

అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ వచ్చిన నాని అనూహ్యంగా ‘అష్టా చమ్మా’తో హీరో అయిపోయాడు. ఆ సినిమా విజయంతో అతడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు. చూపులకు అచ్చం మన పక్కింటబ్బాయిలా కనిపించిన అతడ్ని ప్రేక్షకులు ఆదరించారు. అతడి నటన, అతడి డైలాగ్ డిక్షన్ వాళ్లను మెప్పించాయి. మధ్య తరగతి యువకుని పాత్రలతో క్రమేణా అతడు ఆ వర్గం ప్రేక్షకులకు ఆరాధ్యుడైపోయాడు. ఆ సినిమాని రూపొందించింది ఇంద్రగంటి మోహనకృష్ణ.

అలా నానిని హీరోగా పరిచయం చేసిన ఆయన, ఆ తర్వాత ‘జెంటిల్‌మేన్’లో ద్విపాత్రల్లో నానిని చూపించి మెప్పించాడు. గౌతం, జయరాం అనే భిన్న తరహా పాత్రల్లో విభిన్నంగా, విలక్షణంగా అభినయాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నాడు నాని. ఫలితంగా ‘అస్టా చమ్మా’ను మించి ‘జెంటిల్‌మన్’ హిట్టయింది. ఇప్పుడు ఆ జోడీ హ్యాటిక్‌పై కన్నేసింది.

నానిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటే ఇప్పుడు అతడిని విలన్‌గానూ పరిచయం చేస్తున్నాడు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఆ సినిమాకు ‘వి’ అనే భిన్నమైన టైటిల్ పెట్టారు. ‘వి’ అంటే ‘విలన్’ అని కూడా అర్థం కావచ్చు. సందర్భవశాత్తూ ఇది నానికి 25వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమా హిట్టయితే నాని – ఇంద్రగంటి జోడీకి అది హ్యాట్రిక్ హిట్ అవుతుంది. మరి ఆ ఫీట్‌ను ఈ జోడీ సాధిస్తుందా? చూద్దాం.

నాని – ఇంద్రగంటి ‘హ్యాట్రిక్’? | actioncutok.com

More for you: