‘సాహో’ సంగీత ద‌ర్శ‌కులు వీరేనా?


‘సాహో’ సంగీత ద‌ర్శ‌కులు వీరేనా?

‘సాహో’ సంగీత ద‌ర్శ‌కులు వీరేనా?

‘బాహుబ‌లి’ సినిమాల త‌రువాత ప్రభాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ తెర‌కెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ట్రైలింగ్వ‌ల్ మూవీకి సంబంధించి చిత్రీక‌ర‌ణ దాదాపు తుది ద‌శ‌కు చేరుకుంది.

ఇదిలా ఉంటే, అనివార్య కారణాల వల్ల‌ బాలీవుడ్ సంగీతద‌ర్శ‌క‌ త్ర‌యం శంకర్ – ఎహ్‌సాన్ – లాయ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో, ఇప్పుడు వీరి స్థానంలో అదే బాలీవుడ్‌కు చెందిన తనిష్క్ బాగ్చి, గురు రాంధ్వాల‌ను సంగీత ద‌ర్శ‌కులుగా ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం  ద‌క్షిణాది స్వ‌ర‌క‌ర్త జిబ్రాన్ అందిస్తున్న‌ట్టు టాలీవుడ్ టాక్.

త్వరలోనే ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి. భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతున్న ‘సాహో’.. ఆగస్టు 15న  ప్రేక్షకుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.

‘సాహో’ సంగీత ద‌ర్శ‌కులు వీరేనా? | actioncutok.com

More for you: