‘సుప్రీమ్‌’ జోడీ.. మరోసారి?


'సుప్రీమ్‌' జోడీ.. మరోసారి?
Raashi Khanna

‘సుప్రీమ్‌’ జోడీ.. మరోసారి?

ఆరు వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత ‘చిత్ర‌ల‌హ‌రి’తో ఊర‌ట పొందాడు సాయి తేజ్‌. ఒక‌వైపు ‘చిత్ర‌ల‌హ‌రి’ విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే.. మ‌రో వైపు కొత్త చిత్రాల‌కు క‌మిట్ అవుతున్నాడు తేజ్‌. త్వ‌ర‌లోనే మారుతి  కాంబినేష‌న్ మూవీ ప‌ట్టాలెక్క‌నుండ‌గా.. ‘ప్ర‌స్థానం’ ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట సాయితేజ్‌.

ఇదిలా ఉంటే, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో సాయితేజ్ కాస‌నోవా పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. న‌లుగురు అమ్మాయిల‌తో రొమాన్స్ న‌డిపే ఓ ప్లేబాయ్ చుట్టూ తిరిగే క‌థాంశంతో రానున్న‌ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌కి ‘ప్ర‌తీ రోజు పండ‌గే’, ‘భోగి’ వంటి టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి.

అలాగే న‌లుగురు క‌థానాయిక‌ల‌లో ముగ్గురిగా ఇప్ప‌టికే నిధి అగ‌ర్వాల్‌, రుక్సార్ థిల్లాన్‌, మాళ‌వికా శ‌ర్మ పేర్లు వినిపిస్తుండ‌గా.. ఇప్పుడు మెయిన్ హీరోయిన్‌గా రాశీ ఖ‌న్నా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. గతంలో ‘సుప్రీమ్‌’లో తేజ్‌, రాశి జోడీ అల‌రించిన నేప‌థ్యంలో.. కొత్త చిత్రం కూడా అదే బాట ప‌డుతుందేమో చూడాలి. త్వ‌ర‌లోనే రాశి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

‘సుప్రీమ్‌’ జోడీ.. మరోసారి? | actioncutok.com

More for you: