నాగశౌర్యని పరామర్శించిన దర్శకేంద్రుడు

నాగశౌర్యని పరామర్శించిన దర్శకేంద్రుడు
ఐరా క్రియేషన్స్ బేనర్‌పై నూతన దర్శకుడు రమణతేజ రూపకల్పనలో సినిమా చేస్తోన్న నాగశౌర్య.. ఇటీవల వైజాగ్‌లో ఆ సినిమా షూటింగ్లో గాయపడిన విషయం విదితమే. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తన ఇంట్లో అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు బుధవారం (జూన్ 19) నాగశౌర్య నివాసానికి వచ్చి అతడిని పరామర్శించారు. అతడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. రాఘవేంద్రరావు వెంట రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. “నాగశౌర్య చాలా మంచి కుర్రాడు’ స్వశక్తి తో తనేంటే ప్రూవ్ చేసుకున్న హీరోల్లో శౌర్య ఓకడు’ సినిమా కోసం చాలా కష్టపడతాడు. అతనికి యాక్సిడెంట్ అయింది అనగానే చాలా బాధ అనిపించింది. వెంటనే ఫోన్ లో పరామర్శించాను. కాని మనసు ఒప్పక నేరుగా అతని నివాసానికి వచ్చాను. దేవుని దయవలన త్వరగా కోలుకొని, షూటింగ్ లో చురుకుగా పాల్గోనాలని కొరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు బి.వి.యస్. రవి మాట్లాడుతూ.. “నాకు శౌర్య అంటే గౌరవం వుంది. ఇప్పుడున్న చాలా మంది యంగ్ హీరోల్లో శౌర్య ప్రత్యేక ఇమేజ్ ని సాంతం చేసుకున్నాడు. అలాంటి శౌర్యకి ఇలా జరగటం చాలా బాధగా అనిపించింది. ఈరోజు ఆయనని తన నివాసంలో కలిశి పరామర్శించాం. ఆయనకి మంచి జరగాలని కొరుకుంటున్నాను” అన్నారు.

నాగశౌర్యని పరామర్శించిన దర్శకేంద్రుడు | actioncutok.com
More for you: