తండ్రీకూతుళ్లది ఒకటే బాట!


తండ్రీకూతుళ్లది ఒకటే బాట!

తండ్రీకూతుళ్లది ఒకటే బాట!

‘గ‌రుడ‌వేగ‌’తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌.. ఇప్పుడు ‘కల్కి’ అవ‌తార‌మెత్తాడు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ చిత్రం రిలీజైన కొద్ది వారాల‌కే ఆయ‌న చిన్న కూతురు శివాత్మిక క‌థానాయిక‌గా న‌టించిన తొలి చిత్రం ‘దొర‌సాని’ కూడా రిలీజ్ కానుంది.

అంతేకాదు.. ఈ రెండు చిత్రాల‌కి సంబంధించి ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా  పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ మూవీసే. ‘క‌ల్కి’ 80ల నాటి వాతావర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కితే.. ‘దొర‌సాని’ కూడా 80ల నాటి నేప‌థ్యంలో ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందింది. మ‌రి.. టైటిల్ రోల్స్‌లో వారాల వ్య‌వ‌ధిలో రానున్న తండ్రీకూతుళ్ళు ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటారో చూడాలి.

తండ్రీకూతుళ్లది ఒకటే బాట! | actioncutok.com

More for you: