‘రాజుగారి గది 3’లో అడుగుపెట్టిన తమన్నా


'రాజుగారి గది 3'లో అడుగుపెట్టిన తమన్నా

‘రాజుగారి గది 3’లో అడుగుపెట్టిన తమన్నా

ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది’ హారర్ కామెడీ సిరీస్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు సినిమాలు రాగా మూడో సినిమా ‘రాజుగారి గది 3’ నిర్మాణ కార్యక్రమాలు గురువారం ఉదయం హైదరాబాద్‌లో మొదలయ్యాయి. ఇందులో నాయికగా తమన్నా నటిస్తుండటం విశేషం. హీరోగా మునుపటి రెండు సినిమాల్లో నటించిన అశ్విన్‌బాబు (ఓంకార్ తమ్ముడు) ఈ సినిమాలోనూ హీరోగా చేస్తున్నాడు.

తమన్నా, అశ్విన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టగా, స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై ఓంకార్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం (జూన్ 21) నుంచే సెట్స్‌పైకి వెళ్తోంది.

ఈ సిరీస్‌లోని తొలి సినిమా ‘రాజుగారి గది’ (2015) మంచి విజయం సాధించింది. అందులో అశ్విన్, ధన్యా బాలకృష్న, చేతన్ శీను, పూర్ణ, షకలక శంకర్, ధనరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

సిరీస్‌లోని రెండో సినిమా ‘రాజుగారి గది 2’ (2017)లో నాగర్జున, సమంత నటించినా ఆశించిన రీతిలో ఆడలేదు. అందులో అశ్విన్, అభినయ, సీరత్ కపూర్, రావు రమేశ్, వెన్నెల కిశోర్ వంటివాళ్లు నటించారు.

ఈ నేపథ్యంలో ‘రాజుగారి గది 3’ ఎలా ఉండబోతోందో, ఎలా ఆడుతుందో చూడాలి.

'రాజుగారి గది 3'లో అడుగుపెట్టిన తమన్నా

‘రాజుగారి గది 3’లో అడుగుపెట్టిన తమన్నా | actioncutok.com

More for you: