‘ఆర్ ఆర్ ఆర్’.. సో సీక్రెట్!

‘ఆర్ ఆర్ ఆర్’.. సో సీక్రెట్!
రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న టైంలో.. తారక్, చెర్రీ వేర్వేరు సందర్భాల్లో గాయపడటంతో చిత్రీకరణకు స్వల్ప విరామం ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు గాయం నుంచి కోలుకోవడంతో ఇటీవలే తాజా షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో తారక్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. సాధారణంగా తన సినిమాకు సంబంధించి ప్రతీ అప్డేట్ను మీడియాతో పంచుకునే రాజమౌళి.. ఈ షెడ్యూల్‌కు సంబంధించి ఎటువంటి అప్డేట్ను బయటకి రానివ్వడం లేదు. అంతేకాదు.. తాజాగా ప్రారంభమైన ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో అత్యంత రహస్యంగా చిత్రీకరిస్తున్నారట. మరోవైపు.. షూటింగ్ స్పాట్‌కి మొబైల్ ఫోన్స్ సైతం అనుమతించడం లేదని సమాచారం. ఎందుకంటే.. గతంలో చిత్రీకరణకు సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంత కట్టుదిట్టంగా, అత్యంత రహస్యంగా చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు.. నిత్య మీనన్, సాయిపల్లవి కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్టు టాక్. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాను.. 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
‘ఆర్ ఆర్ ఆర్’.. సో సీక్రెట్! | actioncutok.com
More for you: