వరల్డ్ కప్: ఇంగ్లండ్ గడ్డపై 4 సెంచరీలు చేసిన తొలి ఇండియన్ శిఖర్ ధావన్

వరల్డ్ కప్: ఇంగ్లండ్ గడ్డపై 4 సెంచరీలు చేసిన తొలి ఇండియన్ శిఖర్ ధావన్
వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ కలుపుకొని ఐసీసీ ఒన్డే ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో ఆరు సెంచరీలు చేసిన శిఖర్ ఢావన్.. ఆ ఫీట్ చేసిన రికీ పాంటింగ్, కుమార్ సంగక్కర సరసన చేరాడు. కేవలం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ మాత్రమే 7 సెంచరీలతో ముందున్నారు.
కొంత కాలంగా ఫాం కోల్పోయి ఇబ్బంది పడుతున్న శిఖర్ సరైన సమయంలో ఫాంలోకి వచ్చి ఆస్ట్రేలియాతో ఆదివారం ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో తన 17వ ఒన్డే ఇంటర్నేషనల్ సెంచరీ సాధించాడు. రెండు వామప్ మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వరల్డ్ కప్ మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే అవుటైన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో 109 బంతుల్లో 117 రన్స్ చేశాడు. 37వ ఓవర్లో మిచెల్ స్టార్క్ బంతిని భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు.
ఈ సందర్భంగా శిఖర్ సాధించిన ఘనతలు:
– ఓవల్ మైదానంలో ఆడిన 5 ఒన్డే మ్యాచ్‌లలో శిఖర్‌కు ఇది మూడో సెంచరీ.
– శిఖర్ చేసిన ఈ 17వ ఒన్డే ఇంటర్నేషనల్ సెంచరీతో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన దేశంగా ఆస్ట్రేలియాను ఇండియా అధిగమించింది. వరల్డ్ కప్‌లో ఇండియా 27 సెంచరీలు చేయగా, ఆస్ట్రేలియా (26), శ్రీలంక (23), వెస్టిండీస్ (17), న్యూజీలాండ్ (15) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
– ఇంగ్లండ్ నేలపై 4 ఒన్డే ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన తొలి ఇండియన్ బ్యాట్స్‌మన్ శిఖర్.
– ఇంగ్లండ్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ శిఖర్. 19 ఇన్నింగ్స్‌లలో అతను ఈ ఫీట్ సాధించాడు.
– ఇంగ్లండ్‌లో 4 ఒన్డే ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన రెండో విదేశీ బ్యాట్స్‌మన్ ధావన్.
– వరల్డ్ కప్‌లో ధావన్ చేసిన 117 పరుగులు ఆస్ట్రేలియాపై ఒక బ్యాట్స్‌మన్ చేసిన మూడో అత్యధిక పరుగులు.
వరల్డ్ కప్: ఇంగ్లండ్ గడ్డపై 4 సెంచరీలు చేసిన తొలి ఇండియన్ శిఖర్ ధావన్ | actioncutok.com
More for you: