నిన్న ప్రియాంక.. నేడు శ్రుతి!


నిన్న ప్రియాంక.. నేడు శ్రుతి!
Shruti Haasan

నిన్న ప్రియాంక.. నేడు శ్రుతి!

అందాల తార, ప్రస్తుతం తెలుగులో అవకాశాలేమీ లేని శ్రుతి హాసన్ ఒక అమెరికన్ టీవీ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నది. యూఎస్ఏ నెట్‌వర్క్‌లో ఈ ఏడాది ఆగస్ట్ నుంచి ప్రసారం కానున్న ‘ట్రెడ్‌స్టోన్’ సిరీస్‌లో ఆమె నీరా పటేల్ అనే ఢిల్లీ యువతిగా కనిపించనున్నది. ఒక వైపు వెయిట్రస్ జాబ్ చేస్తూ, మరోవైపు శిక్షణపొందిన కిల్లర్‌గా ప్రమాదకర జీవనాన్ని గడిపే యువతి పాత్రను ఆమె చేస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో మొదలైంది.

ఈ సిరీస్‌లో శ్రుతితో పాటు ఇంగ్లీస్ యాక్టర్ జెర్మీ ఇర్విన్, అమెరికన్ యాక్టర్ బ్రియాన్ జె. స్మిత్ నటిస్తున్నారు. ‘జాసన్ బోర్న్’ ఫ్రాంచైజీ నిర్మాత బెన్ స్మిత్ ఈ సిరీస్‌ను టిం క్రింగ్‌తో కలిసి రచించాడు. ‘బౌర్న్’ సినిమాల్లో మాట్ డామన్ పోషించిన జాసన్ బౌర్న్ క్రియేట్ చేసిన ‘ఆపరేషన్ ట్రెద్‌స్టోన్’ అనే కల్పిత ప్రోగ్రాం చుట్టూ ‘ట్రెడ్‌స్టోన్’ కథ నడుస్తుంది. ప్రస్తుతం శ్రుతి చేస్తోన్న పైలట్ ఎపిసోడ్‌ను రమిన్ బహ్రానీ డైరెక్ట్ చేస్తున్నాడు.

అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో ప్రియాంకా చోప్రా సక్సెస్ అయినట్లే ఈ ‘ట్రెడ్‌స్టోన్’  సిరీస్‌తో శ్రుతి సైతం సక్సెస్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఆమె ‘లాబం’ అనే తమిళ సినిమా, ‘పవర్’ అనే హిందీ సినిమా చేస్తోంది.

నిన్న ప్రియాంక.. నేడు శ్రుతి! | actioncutok.com

More for you: