ముంబైలో త్రీ-బెడ్రూం ఫ్లాట్ కొన్న తాప్సీ


ముంబైలో త్రీ-బెడ్రూం ఫ్లాట్ కొన్న తాప్సీ

ముంబైలో త్రీ-బెడ్రూం ఫ్లాట్ కొన్న తాప్సీ

టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు షిఫ్టయ్యాక తాప్సీ కెరీర్ ఊపందుకున్న విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తాప్సీ ముందు వరుసలో ఉంది. ఎక్కువ కాలం ముంబైలోనే ఉంటున్న ఆమె అక్కడే త్రీ-బెడ్రూం ఫ్లాట్‌ని కొనుగోలు చేసిందనేది లేటెస్ట్ న్యూస్. ఆ ఫ్లాట్‌కు తాప్సీ సోదరి ఇంటీరియర్‌ను డిజైన్ చేస్తుండటం గమనార్హం. ముంబై శివార్లలో తను అద్దెకు ఉంటున్న చోటే ఆ ఫ్లాట్‌ను తాప్సీ కొన్నదని సమాచారం.

అమ్మకానికి ఆ ఫ్లాట్ ఉన్నదని తెలియగానే, ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తాప్సీ దాన్ని కొన్నదంట. ఒక థీం ప్రకారం ఆ ఫ్లాట్‌కు ఇంటీరియర్‌ను సమకూరుస్తున్నరనీ, తాప్సీ సోదరి ఆ పని చేస్తున్నదనీ బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల థాయిలాండ్‌కు వెళ్లిన తాప్సీ అక్కడ నుంచి కొన్ని లైట్లను తీసుకొచ్చిందంట.

సినిమాల విషయానికి వస్తే, ఆమె నటించిన బహు భాషా చిత్రం ‘గేం ఓవర్’ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వై నాట్ స్టూడియోస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిచిన ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకుడు.

ముంబైలో త్రీ-బెడ్రూం ఫ్లాట్ కొన్న తాప్సీ | actioncutok.com

More for you: