21న ‘ఏఏ19’ సెట్స్‌పైకి రానున్న నిన్నటి కలల రాణి!


21న 'ఏఏ19' సెట్స్‌పైకి రానున్న నిన్నటి కలల రాణి!
Tabu

21న ‘ఏఏ19’ సెట్స్‌పైకి రానున్న నిన్నటి కలల రాణి!

తెలుగులో టబు చివరిసారిగా నటించి పదకొండేళ్లయింది. 2008లో ఆమె చంద్రసిద్ధార్థ్ డైరెక్షన్‌లో ‘ఇదీ సంగతి’, రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పాండురంగడు’ సినిమాలు చేశారు. ఒకప్పుడు హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో ఆమె క్రేజీ హీరోయిన్ అనే విషయం తెలిసిందే.

వెంకటేశ్ సరసన నటించిన ‘కూలీ నం.1’తో తెలుగులో నాయికగా అడుగుపెట్టిన ఆమెకు తమిళం నుంచి తెలుగులో డబ్ అయిన ‘ప్రేమదేశం’ తెచ్చిన ఖ్యాతి ఏమిటో తెలిసిందే. యువత ఆరాధ్య తారగా మారిపోయింది. ఇక నాగార్జునతో చేసిన ‘నిన్నే పెళ్లాడతా’ ఆ క్రేజ్‌ను మరింత పెంచింది.

ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే తెలుగులో నటిస్తూ వచ్చిన ఆమె హిందీ సినిమాలకే ఎక్కువ ప్రాధ్యాన్యం ఇస్తూ వచ్చారు. వయసు రీత్యా నాయిక పాత్రలు కాకపోయినా ప్రాధ్యాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తన ఉనికిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు.

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ తెలుగు చిత్రసీమ ఆమెవైపు దృష్టి సారించింది. అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ఇందులో ఆమె బన్నీకి తల్లిగా కనిపిస్తారని వినిపిస్తోంది. అదే నిజమైతే టాలీవుడ్‌లో తొలిసారి హీరో తల్లిగా నటిస్తున్నట్లవుతుంది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఆమె పాత్ర ఏమిటనేది వెల్లడించడానికి ఇష్టపడటం లేదు. ఆమెది కీలక పాత్ర అని మాత్రమే చెబ్తున్నారు. ఈ నెల 21న ఆమె ఈ సినిమా సెట్స్‌కు వస్తారని తెలిసింది.

అల్లు అర్జున్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయి.

21న ‘ఏఏ19’ సెట్స్‌పైకి రానున్న నిన్నటి కలల రాణి! | actioncutok.com

More for you: