తెలంగాణలో TRS కు ఎదురు లేదు!

తెలంగాణలో TRS కు ఎదురు లేదు!
తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం వెల్లడైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మూడు స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవే తరహా ఫలితాలు జడ్పీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను కేటీఆర్ అభినందించారు. వాళ్ల విజయానికి కృషి చేసిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో TRS కు ఎదురు లేదు! | actioncutok.com
More for you: