మీరు ఒంటరిగా చూడ్డానికి వణికిపోయే టాప్ 10 హారర్ మూవీస్


– కార్తికేయ
మీరు ఒంటరిగా చూడ్డానికి వణికిపోయే టాప్ 10 హారర్ మూవీస్

మీరు ఒంటరిగా చూడ్డానికి వణికిపోయే టాప్ 10 హారర్ మూవీస్

గొప్ప హారర్ సినిమాలున్నాయి. అలాగే మనల్ని అమితంగా భయ భ్రాంతులకు గురిచేసి, రాత్రివేళ ఒంటరిగా ఉండాల్సివస్తే భయపడేలా మనల్ని ప్రభావితం చేసే హారర్ సినిమాలున్నాయి. అలాంటి 10 టాప్ టెన్ హారర్ మూవీస్ ఏవో చెప్పుకుందాం. అవి క్లాసిక్స్. వాటిని రూపొందించిన విధానం కానీ, చూసేప్పుడు మనలో కలిగే ఉత్కంఠ కానీ, గుండెల్ని దడదడలాడించడంలో కానీ వాటికవే సాటి. వాటిని చూసిన కొన్ని రోజుల తర్వాత కూడా మనం భయపడుతూనే ఉంటామంటే అవి ఏ స్థాయి హారర్ సినిమాలో ఊహించుకోవచ్చు.

1. ద వానిషింగ్ (1988): జార్జ్ స్లూజర్ రూపొందించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో బెర్నార్డ్-పియర్రె దోనాడ్యూ, జీన్ బెర్వోట్స్, జొహన్నా టెర్ స్టీజ్, గ్వెన్ ఎక్‌హాస్ ప్రధాన పాత్రధారులు. దుష్టత్వాన్ని ఈ సినిమాలో చూపించినంత భయానకంగా, అదే సమయంలో కన్విన్సింగ్‌గా ఏ సినిమాలోనూ చూపించలేదు.

మీరు ఒంటరిగా చూడ్డానికి వణికిపోయే టాప్ 10 హారర్ మూవీస్

2. ద టెక్సాస్ చైన్‌సా మసకిర్ (1974): టోబ్ హూపర్ డైరెక్ట్ చేసిన ఈ హారర్ సినిమాలో మేరీలిన్ బర్న్స్, అలెన్ డాన్‌జిగర్, పాల్ ఎ. పార్టైన్, విలియం వైల్, గున్నర్ హాన్సెన్ ప్రధాన పాత్రలు పోషించారు.

3. ద లాస్ట్ బ్రాడ్‌కేస్ట్ (1998): స్టీఫెన్ అవలోస్, లాన్స్ వీలర్ కలిసి డైరెక్ట్ చేసిన ఈ మిస్టరీ హారర్ మూవీలో డేవిడ్ బియర్డ్, జిం సీవార్డ్, స్టీఫెన్ అవలోస్, లాన్స్ వీలర్, రీన్ క్లాబర్స్ కీలక పాత్రలు చేశారు.

4. ద రింగ్ (2002): గోర్ వెర్బిన్‌స్కి డైరెక్ట్ చేసిన ఈ సూపర్‌నేచురల్ హారర్ మూవీలో నవోమీ వాట్స్, మార్టిన్ హెండర్సన్, డేవిడ్ డోర్ఫ్‌మన్, బ్రియాన్ కాక్స్, జేన్ అలెగ్జాండర్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాకి జపనీస్ రైటర్ కోజి సుజుకి రాసిన ‘రింగ్’ నవల ఆధారం.

5. హుష్ (2016): జాన్ గాల్లఘర్ జూనియర్, కేట్ సీగల్, మైఖెల్ ట్రక్కో, సమంతా స్లోయన్, ఎమ్మా గ్రేవ్స్ నటించిన ఈ హారర్ థ్రిల్లర్‌ను మైక్ ఫ్లానగన్ రూపొందించాడు. కేట్ సీగల్ ఈ సినిమాకి సహ రచయితగా వ్యవహరించింది.

6. క్రీప్ (2014): కేవలం రెండు పాత్రలతో ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్యాట్రిక్ బ్రైస్ రూపొందించాడు. ఆ రెండు పాత్రల్ని ప్యాట్రిక్ బ్రైస్, మార్క్ డుప్లాస్ పోషించారు. మార్క్ ఈ సినిమాకి బ్రైస్‌తో పాటు రచయితగా పనిచేశాడు.

మీరు ఒంటరిగా చూడ్డానికి వణికిపోయే టాప్ 10 హారర్ మూవీస్

7. సినిస్టర్ (2012): ఎథన్ హాక్, జూలియట్ రైలాన్స్, ఫ్రెడ్ డాల్టన్ థామ్సన్, జేమ్స్ రాన్‌సోన్, మైఖెల్ హాల్ డి అడ్డారియో ప్రధాన పాత్రధారులైన ఈ హారర్ థ్రిల్లర్‌ను స్కాట్ డెరిక్సన్ డైరెక్ట్ చేశాడు.

8. ద బబడూక్ (2014): జెన్నిఫర్ కెంట్ రచన చేసి, డైరెక్ట్ చేసిన ఈ హారర్ డ్రామాలో ఎస్సీ డేవిస్, నోవా వైజ్‌మన్, హేలీ మెకెల్లిన్నీ, డేనియల్ హెన్‌షాల్, బార్బరా వెస్ట్ కీలక పాత్రలు చేశారు.

9. లేక్ ముంగో (2008): జోయల్ ఆందర్సన్ రచన చేసి, దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ హారర్‌లో రోసీ ట్రేనార్, డేవిడ్ ప్లెడ్జెర్, మార్టిన్ షార్ప్, తాలియా జుకర్, తానియా లెంటిని ప్రధాన పాత్రధారులు.

మీరు ఒంటరిగా చూడ్డానికి వణికిపోయే టాప్ 10 హారర్ మూవీస్

10. ద బ్లైర్ విచ్ ప్రాజెక్ట్ (1999): డేనియల్ మైరిక్, ఎడ్వార్డో సాంచెజ్ సంయుక్తంగా రూపొందించి, ఎడిట్ చేసిన ఈ సూపర్‌నేచురల్ హారర్ మూవీలో హెదర్ డోనాహ్యూ, జోషువా లియోనార్డ్, మైఖెల్ సి. విలియమ్స్ బాబ్ గ్రిఫిన్, శాంద్రా సాంచెజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

మీరు ఒంటరిగా చూడ్డానికి వణికిపోయే టాప్ 10 హారర్ మూవీస్ | actioncutok.com

More for you: