మామాఅల్లుళ్ళు.. అదుర్స్!

మామాఅల్లుళ్ళు.. అదుర్స్!
అటు ‘ఎఫ్ 2’తో వెంకటేశ్.. ఇటు ‘మజిలీ’తో నాగచైతన్య ఘనవిజయాలను అందుకోవడంతో.. వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న మల్టిస్టారర్ ‘వెంకీమామ’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందునా.. నిజజీవిత పాత్రల్లోనే (మేనమామ, మేనల్లుళ్ళు) వెంకీ, చైతూ కనిపించనుండడంతో ఈ సినిమా ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మిలటరీ నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాలను అక్కడ పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ షూట్లో వెంకీ, చైతూ ఇద్దరూ పాల్గొంటున్నారు. అంతేకాదు, ఈ షెడ్యూల్ దాదాపు ఫినిషింగ్ స్టేజ్‌కి వచ్చిందని సమాచారం. కాగా, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వెంకీ, చైతూ ఫ్యాన్స్‌తో దిగిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మామాఅల్లుళ్ళు ఇద్దరు కూడా గడ్డం లుక్స్‌తో కనిపిస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బహుశా.. సినిమాలోనూ ఇవే లుక్స్‌తో మామాఅల్లుళ్ళు కనిపించే అవకాశం ఉంది.
కె.యస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ‘వెంకీమామ’ సెప్టెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.
మామాఅల్లుళ్ళు.. అదుర్స్! | actioncutok.com
More for you: