మతులు పోగొడుతున్న విద్యా బాలన్!


మతులు పోగొడుతున్న విద్యా బాలన్!

మతులు పోగొడుతున్న విద్యా బాలన్!

సమయం లభిస్తే చాలు.. తారలు ఏదో ఒక సుందర ప్రదేశానికి వెళ్లి సరదాగా గడపడాన్ని హాబీగా మార్చుకుంటున్నారు. విద్యా బాలన్ అందుకు మినహాయింపు కాదు. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రలో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం బాలి (ఇండోనేషియా)లో తన స్నేహితురాలు అదితి సంధుతో కలిసి హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. నటిగా 14 యేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న ఆమె ఆ అందమైన ప్రదేశంలో దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది.

మతులు పోగొడుతున్న విద్యా బాలన్!

అక్కడ్నుంచి తన గార్జియస్ ఫొటోస్‌తో అభిమానుల్ని అలరించింది. బాలి లోని అందమైన బీచ్‌లో తీయించుకున్న ఫొటోల్ని వరుసగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. అందులో కళ్లకు పెద్ద సన్‌గ్లాసెస్ పెట్టుకొని, ఒక చేత్తో పింక్ ఫ్లోరల్ డ్రస్‌ని పైకెత్తి పట్టుకొని మనసారా హాయిగా నవ్వుతూ కనిపిస్తోంది విద్య. ఆ ఫొటోల్లో విద్య అందాలు చూపరుల మతుల్ని పోగొట్టేలా ఉన్నాయి.

“జాయ్.. ఎలైవ్.. హ్యాపీ.. ఫన్ ఇన్ ద సన్.. ప్యూర్ జాయ్.. అదితీ సంధు.. యు హ్యావ్ గాట్ టు బి ద బెస్ట్ కేండిడ్ ఫొటోగ్రాఫర్ ఐ నో. థ్యాంక్యూ.. రిక్ రాయ్.. ఐ లవ్ మై డ్రస్.. థాంక్యూ!” అనే క్యాప్షన్ జోడించింది విద్య.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మతులు పోగొడుతున్న విద్యా బాలన్!
మతులు పోగొడుతున్న విద్యా బాలన్!
మతులు పోగొడుతున్న విద్యా బాలన్!

మతులు పోగొడుతున్న విద్యా బాలన్! | actioncutok.com

More for you: