‘సైరా’లో ఒకలా.. ‘ఉప్పెన’లో ఇంకోలా..!

‘సైరా’లో ఒకలా.. ‘ఉప్పెన’లో ఇంకోలా..!
విజయ్ సేతుపతి.. తమిళ చిత్రాలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి పరిచయం చేయనక్కర్లేని పేరు. అలాగే అనువాద చిత్రాలతోనూ ఇక్కడివారికి విజయ్ సుపరిచితుడే. ‘పిజ్జా’ నుంచి ‘నవాబ్’ వరకు తన నటనతో తెలుగు ప్రేక్షకులనూ అలరించాడీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విజయ్ రెండు తెలుగు చిత్రాలు చేస్తున్నాడు. చిత్రంగా.. అవి రెండు కూడా మెగా క్యాంప్ హీరోల సినిమాలే కావడం విశేషం. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ కాగా.. మరొకటి చిరు మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’. ఈ రెండు సినిమాల్లోనూ విజయ్ పోషిస్తున్న పాత్రలు భిన్నమైనవే.
‘సైరా’లో తమిళం మాట్లాడే ఓబయ్య పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనుండగా.. ‘ఉప్పెన’లో కథానాయిక తండ్రిగా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో దర్శనమివ్వనున్నాడట. అంతేకాదు.. ఈ రెండు చిత్రాల్లోనూ విజయ్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్. మరి.. ఏడాది చివరలో రానున్న ఈ రెండు చిత్రాలతో విజయ్ సేతుపతి తెలుగువారికి మరింత దగ్గరవుతాడేమో చూద్దాం.
‘సైరా’లో ఒకలా.. ‘ఉప్పెన’లో ఇంకోలా..! | actioncutok.com
More for you: