నిర్మాతలి మండలి అధ్యక్షునిగా సి. కల్యాణ్

నిర్మాతలి మండలి అధ్యక్షునిగా సి. కల్యాణ్
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) నూతన అధ్యక్షునిగా సీనియర్ ప్రొడ్యూసర్ సి. కల్యాణ్ ఎన్నికయ్యారు. ఆదివారం (జూన్ 30) హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ భవనంలో జరిగిన ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి రామకృష్ణ గౌడ్‌పై 283 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కల్యాణ్‌కు 378 ఓట్లు రాగా, గౌడ్‌కు కేవలం 95 ఓట్లే పడ్డాయి. ఈ ఎన్నికల్లో 477 మంది నిర్మాతలు ఓటు హక్కు వినియోగించుకోగా, 4 ఓట్లు చెల్లలేదు.
కాగా ఈ ఎన్నికల్లో ‘మన ప్యానల్’ పేరిట పోటీ చేసిన సి. కల్యాణ్ వర్గంలోని వారంతా గెలవడం గమనార్హం. వైస్ ప్రెసిడెంట్స్‌గా కె.అశోక్‌కుమార్, వై.వి.ఎస్.చౌదరి, సెక్రటరీగా టి.ప్రసన్నకుమార్, జాయింట్ సెక్రటరీగా మోహన్ వడ్లపట్ల, ట్రెజరర్‌గా చదలవాడ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అలాగే ఈసీ మెంబర్స్‌గా కె.అమ్మిరాజు, అశోక్‌కుమార్ వల్లభనేని, బండ్ల గణేశ్, ఆచంట గోపీనాథ్, పల్లి కేశవరావు, శివలెంక కృష్ణప్రసాద్, జి.వి. నరసింహారావు, ఎస్.కె. నయీమ్ అహ్మద్, పరుచూరి ప్రసాద్, టి. రామసత్యనారాయణ, వి. సాగర్, వజ్జా శ్రీనివాసరావు, పి. సునీల్‌కుమార్ రెడ్డి, కామిని వెంకటేశ్వరరావు, వి. వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.

నిర్మాతలి మండలి అధ్యక్షునిగా సి. కల్యాణ్ | actioncutok.com
More for you: