Interview: Actor Vijay Deverakonda


Interview: Actor Vijay Deverakonda

Interview: Actor Vijay Deverakonda

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో రౌడీ హీరోగా అనుహ్యమైన స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ఆయన కరిష్మా ఒక్క టాలీవుడ్‌కే పరిమితం కాకుండా, దక్షిణాది అంతా వ్యాపించింది. తాజాగా విజయ్‌ నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 26న విడుదవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదలవుతున్న మొదటి తెలుగు సినిమా ఇదే. ఈ సందర్బంగా హీరో విజయ్‌ దేవరకొండ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…

‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా నాకు బాగా నచ్చింది. దీన్ని మనమే ప్రమోట్‌ చేసుకోవాలి.. అని అలోచించి ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. అందులో భాగంగా ఒక్క తెలుగులో మాత్రేమే కాకుండా.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుద చేస్తున్నాం. అన్ని భాషల్లో ప్రమోషన్‌లో పాల్గొనాలి. అక్కడకు వెళ్లి రొటీన్‌గా ఏదో మాట్లాడితే నాకే బోర్‌ కొట్టేస్తుంది. పైగా అక్కడికి వచ్సిన ప్రేక్షకులు కూడా అలాగే ఫీల్‌ అవుతారని అనిపించి ప్రమోషనల్‌ ఈవెంట్‌ను మ్యూజిక్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌గా మార్చేశాం. సినిమాపై చాలా నమ్మకం ఉంది. ఈ కథ ఎక్కడైనా వర్కవుట్‌ అవుతుంది కాబట్టి ఆ టెన్షన్‌ లేదు. పైగా మన సినిమా ఇన్ని భాషల్లో విడుదల అవుతుండడం అంటే గ్రేట్‌ కదా. పైగా ఇప్పటి వరకు సౌత్‌లో అన్ని భాషల్లో విడుదలైన తెలుగు సినిమా ఏదీ లేదు. ‘బాహుబలి’ని కర్ణాటకలో తెలుగులోనే రిలీజ్‌ చేశారు. అయినా ‘బాహుబలి’తో మన సినిమాను పోల్చుకోలేం. అది వేరే. ఇది వేరే.

ఇమేజ్‌ చూసుకొని ఎగిరిపడను


స్టార్‌ ఇమేజ్‌ అన్నది అది ప్రేక్షకుల సైడ్‌ నుంచి వచ్చిన ఇమాజినేషన్‌. నా వరకు మాత్రం విజయ్‌ అంటే ఇలా ఉంటాడు.. అంతే! ఇమేజ్‌ అన్నదాన్ని చూసుకుని ఎగిరిపడితే దాని ఫలితం ఇంకోలా ఉంటుంది. అందుకే ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోను. కానీ బాధ్యతగా తీసుకుంటా. నా వరకు నా పని ఇది.. దీన్ని తప్పకుండా చేయాలన్టే అది చేస్తా. కానీ ‘బాధ్యత అప్పుడే ఎందుకు?’ అని అప్పడప్పుడు మరచిపోతా.

ఈ కామ్రేడ్‌ కమ్యూనిస్ట్‌ కాదు

ఇది ఒక కామ్రేడ్‌ కథ. బాబీ అనే ఓ స్టూడెంట్‌ లీడర్‌ జర్నీ. దాంతో పాటు లిల్లీ అనే అమ్మాయి ప్రయాణం. వీరిద్దరి ప్రయాణం ఎక్కడ ఎలా కలిసింది.. వారి జీవితంలో వచ్చిన సమస్యలు ఏమిటి?.. అన్నది కథ. మంచి ఎమోషనల్‌ ట్రీట్‌గా ఉంటుంది. సినిమా చూశాక తప్పకుండా ప్రేక్షకుడు ఆ ఎమోషన్‌ను ఇంటిదాకా తీసుకెళతాడు. ‘డియర్‌ కామ్రేడ్‌’ అంటే.. మనకు ఇష్టమైన వాళ్ళను మనం ‘డియర్‌’ అని పిుస్తాం. అలాగే కామ్రేడ్‌ అంటే మనం సాధించుకోవాల్సిన హక్కు గురించి మనం పోరాడటం. అలాగని ఇందులో రాజకీయాలు, కమ్యూనిజం లాంటివి ఏమీ ఉండవు. ఇందులో నా పేరు బాబీ. అతని తాతగారు కమ్యూనిస్ట్‌ నాయకుడు కాబట్టి, చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆ విప్లవ భావాలు ఎక్కువ. అన్యాయాన్ని సహించకపోవడం, తప్పును ఎత్తిచూపడం అనేది నా నైజం. సైలెంట్‌గా నాపని నేను చేస్తూ ఉండలేను. అందుకే కాలేజ్‌లో లీడర్‌గా ఉంటాను.

రష్మిక మంచి స్నేహితురాలు


రష్మిక, నేను కలిసి చేసిన రెండో సినిమా కాబట్టి చాలా ఈజ్‌తో నటించాం. ఆమెనే కాదు రాహుల్‌ రామకృష్ణ లాంటి వాళ్లతో రెండో సారి చేసినప్పుడు కొన్ని కంఫర్ట్‌ లెవెల్స్‌ పెరగటంతో ఇంకా ఈజ్‌గా చేస్తాం. రష్మిక, నేను మంచి స్నేహితులం. ఇందులో ఆమెది లిల్లీ అనే పాత్ర. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సమాజంలో ఉన్న పదిమంది అమ్మాయిల్లో తొమ్మిదిమంది కథ ఇది. ఇక దర్శకుడు భరత్‌ చేసిన షార్ట్‌ ఫిలిమ్స్‌ చూశాను. అతను ఈ కథను ‘అర్జున్‌ రెడ్డి’ షూటింగ్‌ సమయంలో చెప్పాడు. అప్పటి నుంచి ఈ కథను ఫాలో అవుతూనే ఉన్నా. నా మనసుకు బాగా దగ్గరైన సినిమా. భరత్‌ చెప్పినదానికంటే ఇంకా బాగా తీశాడు.

కావాలని పెట్టే ముద్దు సీన్లు హిట్టవ్వవు!

ముద్దు సన్నివేశాలు అన్నవి ఆయా పాత్రల ఎమోషన్‌! అక్కడ ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తున్నాయి అన్న విషయంలో నేను కనిపించకూడదు. ఇప్పుడు ఈ సినిమాలో మీకు విజయ్‌ కనిపించకూడదు, బాబీ కనిపించాలి. అవి కథను బట్టి, ఆయా పాత్రను బట్టి ఉంటాయి తప్ప.. కావాలని పెట్టే ముద్దు సన్నివేశాలు హిట్‌ అవ్వవు. కొత్త దర్శకులు కొత్త కొత్త ఆలోచనతో వస్తున్నారు. మేము మొదలు పెట్టినప్పుడు కొత్తవాళ్ళమే కదా. ఇక్కడ స్టార్‌ దర్శకులు ఊరికే అవకాశాలు ఇవ్వరు. మనల్ని మనం ప్రూవ్‌ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయి. నేను హీరో అవ్వాలనుకున్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశా. అప్పుడు మనం ఎవరో ఎవరికీ తెలియదు కదా. అందుకే మనలా తపన ఉండి, దర్శకులు అవ్వాని ప్రయత్నించే వాళ్ళకోసం చూశా. అప్పుడే నాకు తరుణ్‌ భాస్కర్‌, సందీప్‌రెడ్డి, భరత్‌ కలిశారు. వాళ్లతో సినిమాలు చేయడంతో ఇలా సక్సెస్‌ అందుకున్నాను.

ఆ విషయంలో నాకే క్లారిటీ లేదు

బాలీవుడ్‌లో చేసే ఆలోచనలేదు. ‘కబీర్‌సింగ్‌’లో నటించమని అడిగారు. కానీ చేసిన పాత్రే చేయడం ఇష్టంలేక వద్దనుకున్నా. ‘డియర్‌ కామ్రేడ్‌’ కూడా హిందీలో రైట్స్‌ తీసుకుని రీమేక్‌ చేయబోతున్నారు. కానీ నేను నటిస్తానా లేదా అనేది నాకే క్లారిటీ లేదు. ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా షూటింగ్‌ అరవై శాతం పూర్తయింది. దానికి టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు. దాంతో పాటు ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా ఉంటుంది.

Interview: Actor Vijay Deverakonda | actioncutok.com

More for you: