‘కౌసల్యా కృష్ణమూర్తి’ ట్రైలర్ విడుదల చేసిన మిథాలీ రాజ్


'కౌసల్యా కృష్ణమూర్తి' ట్రైలర్ విడుదల చేసిన మిథాలీ రాజ్

‘కౌసల్యా కృష్ణమూర్తి’ ట్రైలర్ విడుదల చేసిన మిథాలీ రాజ్

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రూపొందించిన చిత్రం ‘కౌసల్యా కృష్ణమూర్తి’. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.47గా కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్నారు.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌ పార్క్ హ్యాత్ హోటల్ లో గ్రాండ్ గా  జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలి రాజ్ ముఖ్య అతిథిగా హాజరై సినిమా ట్రైల‌ర్‌, బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. 

ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ అధ్య‌క్షుడు సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ – “క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అంటే క్రియేటివిటీ. రామారావు అన్న‌య్యకి సినిమాలంటే ప్యాష‌న్‌. ఆయన తెలుగులో రీమేక్ చేసిన సినిమాల‌న్నీ చాలా పెద్ద విజ‌యాల‌ను సాధించాయి. రాజేంద్ర ప్ర‌సాద్‌గారికి తండ్రి పాత్ర‌కు ఎంచుకోవ‌డం అనేది రామారావుగారు చేసిన గొప్ప ప‌ని. మా రామారావు అన్న‌య్య ఎన్నో సెన్సేష‌న‌ల్ హిట్స్‌ను చూసేశాడు. ఈ సినిమా స‌క్సెస్ అయితే కొడుకు స‌క్సెస్‌ను చూసి ఎంజాయ్ చేయ‌డానికి నాంది అవుతుంది. అన్నింటిని మించి మా ద‌ర్శ‌కుడు మా భీమినేని అన్న‌య్య ఈ సినిమాతో ఇంకా హై రేంజ్‌కు చేరుకుంటాడ‌ని భావిస్తున్నాను. ఒక కుటుంబంలాంటి సినిమా. ఒక బాధ, ఎమోష‌న్ ఉండే సినిమా. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్. త‌మిళంలో ఐశ్వ‌ర్య‌కు ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులో అంతే కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను” అన్నారు.

తెలంగాణ ఎఫ్‌.డి.సి చైర్మ‌న్ పుస్కూరు రామ్మోహ‌న్‌రావు మాట్లాడుతూ – “ప్రొఫెష‌న‌ల్‌, ప్యాష‌నేట్ ఫిలిమ్ మేక‌ర్ అయిన రామారావుగారికి అభినంద‌న‌లు. ఆయ‌న త‌న‌యుడు వ‌ల్ల‌భ‌కు నిర్మాత‌గా పెద్ద విజ‌యం ద‌క్కాలి. మంచి ట‌చింగ్ మూవీ అవుతుంద‌ని భావిస్తున్నాను” అన్నారు.

చిత్ర హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ – “క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌లో పనిచేయ‌డ‌మే గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను. కె.ఎస్‌.రామారావుగారు, వ‌ల్ల‌భ‌గారికి థ్యాంక్స్‌. నా కెరీర్ ఫ‌స్ట్ హిట్ ఇక్క‌డి నుండే స్టార్ట్ అవుతుంద‌ని కోరుకుంటున్నాను. ఇక‌పై అంద‌రూ న‌న్ను కౌస‌ల్య కృష్ణ‌మూర్తి కార్తీక్ అనే పిలుస్తార‌ని అనుకుంటున్నాను. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి వ‌ద్ద నుండి చాలా విష‌యాలు నేర్చుకున్నాం. నా లైఫ్‌లో నేను క‌లిసిన బెస్ట్ వ్య‌క్తి ఐశ్వ‌ర్యా రాజేశ్‌” అన్నారు.

ఇండియ‌న్ ఉమెన్  క్రికెట్  టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ – “టీజ‌ర్ చూశాను . చాలా బాగా నచ్చింది. రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంది. నాకు ఎంతో బాగా న‌చ్చింది. మూవీ హ్యూజ్ స‌క్సెస్ అవుతుంది. తల్లిదండ్రులు ఓ అమ్మాయి క‌ల‌లు నేర‌వేర్చ‌డానికి ఎంత దోహ‌ద‌ప‌డ‌తార‌నేది ఈ సినిమాలో చూపించారు. త‌మిళంలో సినిమా చేసిన ‘కణ’ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు. ఎందుకంటే ఉమెన్ క్రికెట్‌ను ఓ మాధ్య‌మం ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. క‌చ్చితంగా అంద‌రికీ చేరుతుంద‌ని భావిస్తున్నాను. ఉమెన్ క్రికెట్ అనే ఆట‌ను అంద‌రూ ఎంక‌రేజ్ చేయాలని చెప్పే చిత్రం. అలాగే మ‌రో వైపు రైతుల క‌ష్టాల‌ను ఆవిష్క‌రింప చేసే చిత్రం. మా అమ్మ‌గారు త‌మిళ చిత్రాన్ని చూశారు. ఆమెకు ఎంత‌గానో న‌చ్చింది. నా టీమ్ మెట్స్‌కు ఈ సినిమాను చూడ‌మ‌ని చెబుతాను” అన్నారు.

న‌టకిరిటీ డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ –“ఏ న‌టుడికైనా ఉండే కెరీర్లో ఎన్ని సినిమాలు చేశామ‌నే దానికంటే, ఎన్ని సినిమాలు గుర్తున్నాయ‌నేదే లెక్క అని నా అభిప్రాయం. ఎన్ని సినిమాలు గుర్తుండేలా తీశామ‌నేదే లెక్క‌. టేస్ట్ అనేది ప్రొడ్యూస‌ర్ ద‌గ్గ‌ర నుండే స్టార్ట్ కావాలి. అది రామారావుగారిలో ఉంది. టేస్ట్‌కు, డ‌బ్బుకు సంబంధం లేదు. ఆర్టిస్టుల్లో మంచి పాత్ర‌లు చేయాల‌నే టేస్ట్ న‌చ్చితే మామూలు పాత్ర‌లు ఆన‌వు. బ్ర‌తుకుదెరువు కోసం కొన్ని సినిమాలు చేసినా కె.ఎస్‌.రామారావులాంటి వ్య‌క్తి మాత్ర‌మే గుండెమీద చెయ్యి వేసుకుని నేను నిర్మాత‌ను అని చెప్ప‌గ‌లిగే ధైర్యం ఉంటుంది. వ‌ల్ల‌భ వ‌చ్చినా ఆయ‌న‌లో నిర్మాత‌గా టేస్ట్ పోలేదు అన‌డానికి కౌస‌ల్య కృష్ణ‌మూర్తే ఓ ఉదాహ‌ర‌ణ‌. నాక‌న్నా నాకు వ‌చ్చిన అవ‌కాశం గొప్ప‌ది.. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే పాత్ర‌ల‌కు త‌గిన న‌టులే దొరికారు. న‌టుల‌ను ఎంపిక‌కు భీమినేని శ్రీనివాస‌రావు, రామారావుగారే కార‌ణం. ఓ ప్ర‌త్యేక‌మైన న‌టుడిగా పేరు తెచ్చుకున్న నేను చాలా ఎంజాయ్ చేస్తూ న‌టించాను. ఒరిజిన‌ల్‌గా ఉన్న అన్ని అంశాల‌ను మిస్ కాకుండా, అంత కంటే ఎక్కువ‌గానే ఈ సినిమాలో చూపించార‌ని అనుకుంటున్నాను” అన్నారు.

ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ – “ఈ సినిమా చేయ‌డానికి ముఖ్య కార‌ణం కె.ఎస్‌.రామారావుగారే. ఆయ‌న ద‌గ్గర నుండి ఫోన్ చేయ‌గానే, ఆయ‌న్ని మ‌రుస‌టి రోజు క‌లిశాను. ఆరోజు నుండి ఈరోజు వ‌ర‌కు సినిమాను అద్భుతంగా ప్రేమించి చేశాం. అరుణ్‌రాజ్‌గారు ఎంతో త‌ప‌న ప‌డి, ఎన్నో లేయ‌ర్స్‌ను పొందుప‌రిచి చేసిన సినిమా ఇది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను శివ‌కార్తీకేయ‌న్ ప్రొడ్యూస్ చేస్తూ ఆయ‌న గెస్ట్ రోల్ చేస్తూ న‌టించాడు. త‌మిళంలో పెద్ద హిట్ అయిన సినిమా ఇది. దిబునిన‌న్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. త‌మిళంలో ఫ్లెవ‌ర్‌ను మిస్ కాకుండా చేయాల‌ని ముందుగానే నిర్ణ‌యించుకున్నాను. త‌మిళంలో స‌త్య‌రాజ్‌గారు చేసిన పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తార‌ని ఆలోచించ‌గానే రాజేంద్ర ప్ర‌సాద్‌గారు అనుకుని ఆయ‌న్ని దృష్టిలో పెట్టుకుని స‌న్నివేశాలు రాసుకు‌న్నాను. రాజేంద్ర ప్ర‌సాద్‌గారి పెర్ఫామ‌న్స్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అద్భుతంగా న‌టించారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ న‌ట‌న చూసి నాకే ఏడుపొచ్చేసింది. కె.ఎస్‌.రామారావు టాప్ టెన్ ప్రొడ్యూస‌ర్స్‌లో ఒక‌రు. డెఫ‌నెట్‌గా ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను” అన్నారు.

ఐశ్వ‌ర్యారాజేశ్ మాట్లాడుతూ – “త‌మిళంలో 25 సినిమాలు త‌ర్వాత తమిళంలో నేను చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘క‌ణ’‌. మంచి క‌థ ఉన్న సినిమాతో తెలుగులో లాంచ్ కావాల‌నుకున్నాను. 25 సినిమాలు త‌ర్వాత ‘క‌ణ’ ఎలాగైతే అవ‌కాశం వ‌చ్చిందో.. తెలుగులో తొలి సినిమానే ‘కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’గా వ‌చ్చింది. ఇలాంటి లాంచ్ అంద‌రికీ దొరుకుతుందా? నాకు తెలియ‌దు. ‘కణ’ సినిమా టీజ‌ర్ కె.ఎస్‌.రామావుగారికి చూపించాను. ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి ఈసినిమాను కొని 3 వారాల్లోనే షూటింగ్ స్టార్ట్ చేశారు. క‌ళ్లు మూసి తెరిచేలోగా సినిమా విడుద‌లవుతోంది. ఓరిజిన‌ల్ కంటెంట్ పోకుండా డైరెక్ట‌ర్ భీమినేని వంద‌శాతం న్యాయం చేశారు. త‌మిళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులోనూ అంతే పెద్ద హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్‌గారు నా తండ్రి పాత్ర‌లో.. ఝాన్సీ  నా త‌ల్లి పాత్ర‌లో న‌టించారు” అన్నారు.

'కౌసల్యా కృష్ణమూర్తి' ట్రైలర్ విడుదల చేసిన మిథాలీ రాజ్

చిత్ర స‌మ‌ర్ప‌కుడు కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ – “ఈ సినిమా చేయ‌డానికి ముఖ్య కార‌ణం అరుణ్‌రాజ కామ‌రాజ్. ఐశ్వ‌ర్యా రాజేశ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకున్న‌ప్పుడు ఆమె అంత‌కుముందు త‌మిళంలో చేసిన కొన్ని చిత్రాల‌ను చూశాను. ఆ సినిమాలు నేష‌న‌ల్ లెవ‌ల్లోనే కాదు.. ఇత‌ర దేశాల్లోనూ మంచి పేరొచ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలోనూ గొప్ప క్యారెక్ట‌ర్ చేసింది. ఆ స‌మ‌యంలో ‘క‌ణ’ టీజ‌ర్‌ను త‌ను నాకు పంపింది. ఆ టీజ‌ర్‌ నాకు న‌చ్చింది. వెంట‌నే ఆమెకు ఫోన్ చేసి ఈ సినిమాను నేను తెలుగులో చేయాల‌నుకుంటున్నాను రైట్స్ కావాల‌ని అడ‌గ్గానే ఆమె వ్య‌క్తిగ‌తంగా నాకోసం ఆమె త‌మిళ నిర్మాత‌లను రిక్వెస్ట్ చేసింది. త‌మిళంలో సినిమావిడుద‌లైన కొన్నిరోజుల త‌ర్వాత తెలుగులో రైట్స్‌ నాకే వచ్చాయి. దాన్ని అలాగే తెలుగులో మేం రూపొందించాం. సావిత్రిగారు, శార‌ద‌గారు నుండి ఇప్ప‌టి స‌మంత వ‌ర‌కు నేను తెలుగులో గొప్ప న‌టీమ‌ణులను చూశాను. వారేవ‌రికీ తీసిపోని గొప్ప పెర్ఫామ‌ర్ ఐశ్వ‌ర్యా రాజేశ్‌. భీమినేని శ్రీనివాస‌రావుగారు చెప్పిన దానికంటే గొప్ప పెర్ఫామ‌ర్‌. సినిమాను 35 రోజులు భ‌యంక‌ర‌మైన క్లైమేట్‌లో సినిమాను చేశాం. అంద‌రూ మంచి ప్రొడ‌క్ట్ కోసం క‌ష్ట‌ప‌డ్డారు. త‌మిళంలోలాగానే తెలుగులోనూ సినిమా పెద్ద హిట్ అవుతుంది. భీమినేని ఎంతో జాగ్ర‌త్త‌గా, కూల్‌గా త‌న‌కు కావాల్సిన ఎలిమెంట్స్‌ను రాబ‌ట్టుకున్నారు” అన్నారు. 

‘కౌసల్యా కృష్ణమూర్తి’ ట్రైలర్ విడుదల చేసిన మిథాలీ రాజ్ | actioncutok.com

More for you: