‘పోలీస్ పటాస్’ ట్రైలర్ విడుదలైంది


'పోలీస్ పటాస్' ట్రైలర్ విడుదలైంది

‘పోలీస్ పటాస్’ ట్రైలర్ విడుదలైంది

ఆయేషా హబీబ్, రవి కాలే ప్రధాన పాత్రధారులుగా శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పోలీస్ పటాస్’. బీమవరం టాకీస్ పతాకంపై  తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 97వ చిత్రమిది.  ఇటీవలలే ఈ మూవీ ఫస్ట్ లుక్ ను బిజెపి ఎంపి టి.జి. వెంకటేష్ ఆవిష్కరించారు. కాగా జూలై 4న కొణిజేటి రోశయ్య 87వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మాత  రామ సత్యనారాయణ ఈ సినిమా ట్రైలర్ ను రోశయ్య చేత ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా రోశయ్య మాట్లాడుతూ.. “రామ సత్యనారాయణ నిర్మాతగా వంద సినిమాలకు చెరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. తన బ్యానర్ నుంచి వస్తున్న 97వ చిత్రం ‘పోలీస్ పటాస్’ మంచి విజయాన్ని అందుకొవాలని ఆశిస్తున్నా” అన్నారు.

రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. “పెద్దలు రొశయ్య గారు మాకు గురువు. మా విజయాల వెనుక స్పూర్తి ని అందించిన వారు. ఆయన జన్మదినం అంటే మాలాంటి వారికి పర్వదినం. ఈ సందర్బంగా త్వరలొనే మా బ్యానర్ నుంచి వస్తున్న 97వ చిత్రం ‘పోలీస్ పటాస్’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఆయేషా నటన ఈ చిత్రానికి హైలైట్. మాస్‌ను ఆకట్టుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి” అన్నారు.

‘పోలీస్ పటాస్’ ట్రైలర్ విడుదలైంది | actioncutok.com

More for you: