‘రాజ్ దూత్’ ప్రిరిలీజ్ ఈవెంట్


'రాజ్ దూత్' ప్రిరిలీజ్ ఈవెంట్

‘రాజ్ దూత్’ ప్రిరిలీజ్ ఈవెంట్

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం ‘రాజ్ ధూత్‘. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌ (స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో సినీ ప్ర‌ముఖ‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా…

శాంతి శ్రీహ‌రి మాట్లాడుతూ, “మేఘాంశ్ ‘భైర‌వ’సినిమాలో న‌టించాడు. అదే త‌న తొలి సినిమా. ఇది రెండ‌వ సినిమా. పాఠాలు చ‌ద‌వ‌డు. డైలాగులు పేజీలు బాగా చ‌దువుతాడు. అప్పుడే అర్ధ‌మైంది. బ్ల‌డ్ లోనే ఉంది. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత శ్రీహ‌రిగారి పేరును నిల‌బెడ‌తాడ‌న్న న‌మ్మ‌కం వ‌చ్చింది. శ్రీహ‌రిగారికి ఇచ్చిన స‌పోర్ట్ నా బిడ్డ‌ల‌కు ఇస్తార‌ని ఆశిస్తున్నా" అని అన్నారు.

నిర్మాత సి. క‌ల్యాణ్ మాట్లాడుతూ, “నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కార‌ణం మా బావ‌ (శ్రీహ‌రి). మా ఇద్ద‌రిది 35 ఏళ్ల అనుబంధం. నాకు హైద‌రాబాద్ లో ఇల్లు కొనిచ్చింది ఆయనే. శ్రీహ‌రి నిల‌యం దానిపేరు. శాంతి చేతుల మీదుగా ఆ ఇల్లు ప్రారంభించింది. నిర్మాత స‌త్తిబాబు నాకు షాకిచ్చాడు. "శ్రీహ‌రి గారి అబ్బాయితో నేను సినిమా చేయాలి? కానీ మీరేంటి?" అన్నా. "లేదు సినిమా స్టార్ట్ అయింది" అని చెప్పారు. మా పెద్దొడి (శ్రీహ‌రికి పెద్ద కొడుకు) ద‌ర్శ‌క‌త్వంలో చిన్నోడు హీరోగా ఓ సినిమా నిర్మిస్తా. ఎంత ఖ‌ర్చు అయినా చేస్తా. ఇప్ప‌టివ‌రకూ నేను రెండే డెత్ లు చూసా. ఎన్టీఆర్ త‌ర్వాత‌. శ్రీహ‌రి చ‌నిపోయిన‌ప్పుడే అంత జ‌నం వ‌చ్చారు. 16 కిలోమీట‌ర్ల మేర జ‌నాలంతా న‌డుచుకునే వ‌చ్చారు. ఇంటికి ఉండే అన్ని కాంపౌండ్ వాల్స్ ప‌డిపోయాయి. అంటే మా బావ‌ అంత అభిమానం సంపాదించుకున్నారు. త‌న‌తో జ‌ర్నీ చేసిన వారు ఎప్ప‌టికీ మ‌ర్చిపోరు. ప్రతీ నిర్మాత బావ గురించి ఎలా మాట్లాడుకునే వారు. మేఘాంశ్ గురించి అలాగే మాట్లాడుకోవాలి. తండ్రిలా పెద్ద స్టార్ అవ్వాలి. రాజ్ ధూత్ టీమ్ లో మంచి ఫైర్ ఉంది. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకు రావాలి” అని అన్నారు.

హీరో మేఘాంశ్ మాట్లాడుతూ, “అమ్మ‌నాన్న‌ల వ‌ల్లే ఇక్క‌డ ఉన్నాను. డాడి లేక‌పోవ‌డంతో మ‌మ్మ‌ల్నిపెంచ‌డానికి అమ్మ చాలా క‌ష్ట‌ప‌డింది. ఇక సినిమా విష‌యానకి వ‌స్తే జ‌న‌వ‌రిలో స్టార్ట్ చేసాం. త‌క్కు టైమ్ లో షూటింగ్ పూర్తిచేసాం. మాద‌ర్శ‌కులు ఇద్ద‌రైనా ఒక‌రిగా ప‌నిచేసారు. చాలా క్లారిటీగా తీసారు. ఆదిత్య మీన‌న్ ప‌వ‌ర్ ఫుల్ రోల్ చేసారు. సుద‌ర్శన్ పాత్ర బాగా న‌వ్విస్తోంది. ప్రియాంక‌, న‌క్ష‌త్ర‌ల‌తో ప‌నిచేయ‌డం వెరీ హ్య‌పీ. అంతా చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసాం. జులై 5న రిలీజ్ అవుతుంది. పైర‌సీ ఎంక‌రేజ్ చేయ‌కండి. థియేట‌ర్ కు వ‌చ్చి చూడండి” అని అన్నారు.

ద‌ర్శ‌కుడు బాబి మాట్లాడుతూ, “శ్రీహ‌రిలో దేవుడు క‌నిపించేవారు. 'భ‌ద్రాద్రి' అనే సినిమాతో రైట‌ర్ గా కెరీర్ ప్రారంభించా. టీజ‌ర్, ట్రైల‌ర్ అదిరిపోయాయి. సినిమాలో అన్ని బాగా కుదిరాయి. మ‌నిషి ఉన్న‌ప్పుడు వ‌స్తారు. కానీ ఆయ‌న లేన‌ప్పుడు వ‌చ్చారంటే ఆయ‌న ఎంత గొప్ప వారో అర్ధ‌మ‌వుతోంది ” అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కులు అర్జున్- కార్తీక్ మాట్లాడుతూ, నిర్మాత‌కు క‌థ చెప్ప‌గానే మూడు రోజుల్లో ఒకే చేసారు. ద‌ర్శ‌కులుగా అవకాశం ఇచ్చ‌నింద‌కు ఆయ‌న‌కు థాంక్స్.. మేఘాంశ్ అన‌గానే భ‌య‌ప‌డ్డాం. తను ఎద్ద డైరెక్ట‌ర‌స్ తో సినిమాలు చేయోచ్చు. కానీ మ్మ‌ల్ని న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు. యూనిట్ అంతా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసారు. అందువ‌ల్లే సినిమా ఇంత బాగా వ‌చ్చింది అని అన్నారు.

హీరోయిన్ న‌క్ష‌త్ర మాట్లాడుతూ, “నేను తెలుగు అమ్మాయిని. నాతొలి సినిమా. కెరీర్ ఆరంభంలోనే మంచి పాత్ర చేసాను. ఈ టీమ్ తో ప‌నిచేస్తున్న‌ప్పుడు శ్రీహ‌రిగారి గొప్ప‌త‌నం తెలిసింది. మేఘాంశ్ మంచి కోస్టార్. అంద‌రితో స‌ర‌దాగా ఉంటాడు. అంతా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసాం. సినిమా మంచి విజ‌యం సాధిస్తుంది” అని అన్నారు.

త‌ల‌సాని సాయి మాట్లాడుతూ, శ్రీహ‌రిగారిని బాబాయ్ అని పిలిచేవాడ్ని. శాంతి గారు న‌న్ను పెద్ద కొకుడులా చూసేవారు. మేఘాంశ్ ని చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తునే ఉన్నా. మేఘాంశ్ నూరుశాతం శ్రీహ‌రి గారి పేరును నిల‌బెడ‌తాడు ఇక్క‌డున్న నిర్మాత‌లు మేఘాంశ్ తో సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నా. సినిమా స‌క్సెస్ అయి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి అని అన్నారు. ఆకాష్ పూరి మాట్లాడుతూ, ` ట్యాలెంట్ మేఘాంశ్ బ్ల‌డ్ లోనే ఉంది. భ‌విష్యత్ లో మంచి సినిమాలు చేయాలి అన్నారు.

రాజా ర‌వీంద‌ర్ మాట్లాడుతూ, ` శ్రీహ‌రి- శాంతి గారుపెళ్లికి కాక ముందునుంచి ప‌రిచ‌యం. వాళ్లిద్ద‌రి ల‌వ్ స్టోరీ కూడా తెలుసు. శ్రీహ‌రి అన్న‌య్య డేట్లు నేనే చూసేవాడిని. శ్రీహ‌రితో ప‌ర‌చ‌యాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. డ‌బ్బు గురించి ఎప్పుడు ఆలోచించ‌లేదు. చాలా మందికి ఎన్నో స‌హాయాలు చేసేవారు. ఈరోజు ఆయ‌న ఉండుంటే చాలా ఆనందించేవారు. మంచి మ‌నుషులు ఎక్కువ కాలం ఉండ‌రు అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం అని అన్నారు.

ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ మాట్లాడుతూ, మేఘాంశ్ నీతో సినిమా చేసిన వాళ్ల‌ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోకు. ఇండ‌స్ర్టీ లో చాలా మంది ఉన్నారు. ఇక్క‌డ ఎవైరా ఏదైనా అవ్వొచ్చు. శ్రీహరి గారి వ‌ల్ల ఎంతో మంది వివిధ రంగాలో సెటిల్ అయ్యారు. రాజ‌కీయాలలో కూడా ఉన్నారు. తొలి నిర్మాత దేవుడు. నేను ఇలా ఉండ‌టానికి కార‌ణం శ్రీహ‌రి గారే. శ్రీహ‌రి గారు ఎప్పుడూ రియ‌ల్ స్టారే. ఆయ‌న రుణం ఎవ‌రూ ఎప్ప‌టికీ తీర్చుకోలేరు. స‌త్యానారాయ‌ణ గారు మేఘాంశ్ ని హీరో పెట్టి సినిమా చేసినంద‌కు కృత‌జ్ఞ‌త‌లు. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి అని అన్నారు.

నిర్మాత బెల్ల‌కొండ సురేష్ మాట్లాడుతూ, నేను నిర్మాత‌గా ఉన్నానంటే కార‌ణం శ్రీహ‌రిగారే. నాకు ఇండ‌స్ర్టీలో హీరోల‌ను, టెక్నిషియ‌న్ల‌ను ఆయ‌నే వ‌ల్లే ప‌రిచయం అయ్యారు. ఆయ‌న ఉండేంటే చాలా మంది నిర్మాత‌లు ఇండ‌స్ర్టీకి వ‌చ్చేవారు. ఎంతో మందికి స‌హాయం చేసిన గొప్ప వ్యక్తి. మ‌హా స‌ముద్రంలాంటి మ‌హా వ్య‌క్తి. ఆయ‌న మ‌న మ‌ద్య లేక‌పోవ‌డం దుర‌దృష్ట క‌రం. ఇప్పుడు శ్రీహ‌రిగా రి అబ్బాయి హీరోగా ప‌రిచ‌యం అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. ట్రైల‌ర్ చాలా బాగుంది. సినిమా పెద్ద విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి అని అన్నారు.

డైరెక్ట‌ర్ దేవి ప్ర‌సాద్ మాట్లాడుతూ, తొంద‌ర‌ప‌డి మ‌ధ్నాహ్న‌మే అస్త‌మించిన సూర్యుడు శ్రీహ‌రిగారు. న‌న్ను మొద‌టిగా ద‌ర్శ‌కుడిగా గుర్తించింది ఆయ‌నే. ఆయ‌న హీరో అవ్వ‌క ముందు నుంచే తెలుసు. మేము అసిస్టెంట్స్ ఉన్న‌ప్పుడు క్యారెక్ట‌ర్లు చేసారు. మంచి ఇంప్రెసన్ ప‌డితే లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. నాకు ద‌ర్శ‌కుడిగా పిలిచి అవ‌కాశం ఇచ్చిన వ్య‌క్తి. మేఘాంశ్ తండ్రి గా ఇందులో న‌టించాను. శ్రీహ‌రి గారి అబ్బాయి అన‌గానే న‌టించేస్తాను చెప్పా. ఇద్ద‌రు గ్రేట్ ఆర్టిస్టుల క‌డుపున మేఘాంశ్ పుట్టాడు. అత‌నికి మంచి భ‌విష్య‌త్ ఉంది. పెద్ద అబ్బ‌యి డైరెక్ట‌ర్ అవుతున్నాడ‌ని తెలిసింది. ఎక్క‌డున్నా వాళ్ల‌కి ఆశీర్వాద‌లు ఉంటాయి. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు క‌లిసి సినిమా చేయ‌డం చిన్న విష‌యం కాదు. కానీ చాలా చ‌క్క‌ని కో ఆర్డినేష‌న్ తో చేసారు. పాట‌లు బాగున్నాయి. అంద‌రికీ పేరుతో పాటు, నిర్మాత‌కు మంచి లాభాలు తీసుకురావాలి అని అన్నారు.

ర‌వి కుమారి చౌద‌రి మాట్లాడుతూ, 1994లో సాగ‌ర్ అమ్మ‌దొంగ సినిమాకు అప్రెంటీస్ గా ప‌నిచేసా. నాకు ఎప్ప‌టి నుంచో క్లాప్ కొట్టాల‌నే ఆశ ఉంది. ఎప్పుడూ విన‌య్ కొట్టేవాడు. కానీ శ్రీహ‌రిగా వ‌ల్ల క్లాప్ కొట్టే అవ‌కాశం అప్పుడు నాకు వ‌చ్చింది. నా జీవితంలో తొలిసారి శ్రీహ‌రి మీద క్లాప్ కొట్టి సింగిల్ టేక్ లో ఒకే చేసింది . ఆరోజే న‌న్ను ఇండ‌స్ర్టీని దున్నేస్తావు అన్నారు. ఇలా ఆయ‌న‌తో ఎంతో అనుబంధం ఉంది. శ్రీహ‌రి గారు ఉండుంటే అక్ష‌ర ఫౌండేష‌న్ చాలా బాగుండేది. మ‌ళ్లీ ఎప్పుడు ఆ ఫౌండేష‌న్ ప్రారంభించినా నా స‌హ‌కారం ఉంటుంద‌న్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ, అర్జున్ -కార్తీక్ నాలుగేళ్లు నా ద‌గ్గ‌ర ప‌నిచేసారు. రాజ్ దూత్ క‌థ నాలుగేళ్ల క్రితం చెప్పారు. ఏడాది క్రితం శ్రీహ‌ర‌ని గారి అబ్బాయితో చేస్తున్నామ‌ని చెప్ప‌గానే సంతోషించా. అర్జున్-కార్తీక్ హ్యూమ‌ర్ బాగా రాస్తారు. కామెడీ బాగుందన్నారు. అదీ అర్జున్ -కార్తీక్ మార్క్. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు రావాలి అన్నారు.

అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ, మా జ‌న‌రేష‌న్ డైరెక్ట‌ర్స్ అంతా గొప్ప ఆర్టిస్ట్ ను మిస్ అయ్యాం. ఆయ‌న ఉండుంటే నా ఆర్ ఎక్స్ 100 లో డాడి పాత్ర శ్రీహ‌రిగారిని బ్ర‌తిమ‌లాడి చేయించేవాడిని. ఈ సినిమా టీజ‌ర్ టీజ‌ర్ బాగుంది. హీరో లో మాసివ్ లుక్ ఉంది. ఆర్ ఎక్స్ 100లా రాజ్ ధూత్ పెద్ద హిట్ `అవ్వాలన్నారు.

చిత్ర నిర్మాత స‌త్యనారాయ‌ణ మాట్లాడుతూ, రెండేళ్ల క‌ష్టం ఈ సినిమా. తొలి సినిమా ఇబ్బందుల్లో ఉంది. రెండ‌వ సినిమా మొద‌లు పెట్టావ్ . ఏంటి నీ ధైర్యం అని కొంద‌రు అన్నారు. నా ధైర్యం అమ్మానాన్న‌లు, స్నేహితులు, కుటుంబం. అంద‌రి ధైర్య‌మే ఈ సినిమా. నేను గొప్ప నిర్మాత అవుతను అవుతానో? లేదో తెలియ‌దు. కానీ అర్జున్- కార్తీక్ మంచి ద‌ర్శ‌కులు అవుతారు. మేఘాంశ్ అద్బుతంగా చేసాడు. ఈ సినిమా అంద‌రికీ బ్రాండ్ లా నిల‌వాలి. న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.

‘రాజ్ దూత్’ ప్రిరిలీజ్ ఈవెంట్ | actioncutok.com

More for you: