Rakshasudu Movie Preview


Rakshasudu Movie Preview

Rakshasudu Movie Preview

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘రాక్షసుడు’ సినిమా ఆగస్ట్ 2న విడుదలవుతోంది. పోస్టర్ డిజైనర్ నుంచి డైరెక్టర్‌గా మారిన రమేశ్‌వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేయగా, హవీశ్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ బేనర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మించారు. కె.ఎల్. యూనివర్సిటీ చైర్మన్ అయిన సత్యనారాయణకు నిర్మాతగా ఇదే మొదటి సినిమా.

‘రాక్షసుడు’ అనేది తమిళంలో హిట్టయిన ‘రాక్షసన్’ మూవీకి రీమేక్. అందులో తమిళ వర్ధమాన నటుడు విష్ణువిశాల్ హీరోగా నటిస్తే, అమలా పాల్ నాయిక పాత్రను పోషించింది. తమిళ మాతృకకు ఎక్కువ మార్పులు చేర్పులు చేయకుండా తెలుగుతనాన్ని అద్ది ‘రాక్షసుడు’ సినిమాని రమేశ్‌వర్మ రూపొందించాడు. ‘కవచం’లో పోలీస్‌గా కనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి ఈ సినిమాలో పోలీసుగా కనిపించనున్నాడు. అనుపమ టీచర్ కేరెక్టర్ పోషించింది.

నిజానికి ఈ సినిమాని తన కుమారుడు హవీశ్ హీరోగా చేద్దామని మొదట అనుకున్నారు నిర్మాత సత్యనారాయణ. అయితే అప్పటికే ఇదే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో హవీశ్ ‘సెవెన్’ సినిమా చేస్తుండటంతో, తప్పనిసరిగా బయటి హీరోను ఎంచుకోవాల్సి వచ్చింది. అలా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. అలాగే టీచర్ రోల్‌కు ఫస్ట్ చాయిస్ అనుపమ కాదు. రాశీ ఖన్నా లేదా రకుల్‌ప్రీత్ సింగ్‌లలో ఒకరిని ఆ పాత్రకు తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావించారు. టీచర్ రోల్‌లో వాళ్లకంటే అనుపమ మరింతగా సూటవుతుందనే అభిప్రాయానికొచ్చి ఆమెను తీసుకున్నారు.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించాయి. ఇవాళ సమాజంలో టీనేజ్ అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని కాసుల పంట కురిపిస్తుందని నిర్మాత ఆశిస్తున్నారు. అలాగే ఈ సినిమాతో తమ కెరీర్ గాడిన పడుతుందని బెల్లంకొండ శ్రీనివాస్, అటు రమేశ్‌వర్మ ఆశిస్తున్నారు.

Rakshasudu Movie Preview | actioncutok.com

More for you: