‘ఎర్ర‌చీర‌’లో శ్రీ‌కాంత్


'ఎర్ర‌చీర‌'లో శ్రీ‌కాంత్
Srikanth

‘ఎర్ర‌చీర‌’లో శ్రీ‌కాంత్

సత్య సుమన్‌బాబు డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘ఎర్రచీర’. బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది హార‌ర్ యాక్షన్ స‌స్పెన్స్ ప్ర‌ధానంగా రూపొందుతున్న‌ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్. ఈ చిత్రంలో హీరో శ్రీ‌కాంత్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

ఈ విషయాన్ని దర్శకుడు సత్య సుమన్‌ బాబు తెలియజేస్తూ “మా సినిమాలో శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ న‌టించ‌డం ప్ర‌త్యేక‌ ఆక‌ర్ష‌ణ. ఆయ‌న పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. క‌థ‌లో ఎంతో కీల‌క‌పాత్రను చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ‌రాం, అలీ పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. ఛేజింగ్‌ సీన్స్‌, హారర్‌, కామెడీ సన్నివేశాలు అబ్బుర‌ప‌రుస్తాయి” అని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తోట సతీష్‌ మాట్లాడుతూ.. రాజీ లేకుండా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో లీజ్‌ చేసేందుకు సన్నాహాలు  చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి మాట‌లు:  గోపీ విమ‌ల పుత్ర‌, కెమెరా: చ‌ందు, ఫైట్స్: న‌ందు, క‌ళ‌: సుభాష్‌- నాని, క‌థ‌-క‌థ‌నం-ద‌ర్శ‌క‌త్వం: సత్య సుమన్‌ బాబు.

‘ఎర్ర‌చీర‌’లో శ్రీ‌కాంత్ | actioncutok.com

More for you: