Actor Sharwanand Interview


Actor Sharwanand Interview

Actor Sharwanand Interview

“సురేఖ (మెగాస్టార్ చిరంజీవి సతీమణి) ఆంటీ ఫోన్ చేసి “చాలా అందంగా ఉన్నావ్” అని చెప్పారు. అదే నేనందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్” అన్నారు శర్వానంద్. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రణరంగం’లో ఆయన హీరోగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై తయారైన ఆ సినిమా ఇటీవల విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ సందర్భంగా శర్వానంద్ ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు…

రణరంగం’ కు ఫీడ్‌బ్యాక్‌ ఎలా ఉంది?

‘రణరంగం’కు నా కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. సినిమా రిలీజైనప్పుడు మార్నింగ్‌ షోకి డివైడ్‌ టాక్‌ వచ్చింది. మ్యాట్నీకి ఫర్వాలేదన్నారు. సెకండ్‌ షోకు వచ్చేసరికి ఎబోవ్‌ యావరేజ్‌ అనే టాక్‌ వచ్చింది. ప్రస్తుతం అక్కడే ఆగింది. మున్ముందు మరింత పాజిటివ్‌ టాక్‌ వచ్చి బాగా ఆడుతుందని నమ్ముతున్నా.

మూవీ రిజల్ట్ విషయంలో మీ అభిప్రాయమేంటి?

ఈ రిజల్ట్‌ని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. రివ్యూలు యావరేజ్‌గా వచ్చినా కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. ఎప్పుడూ లేనిది బీ, సీ సెంటర్లలో థియేటర్లు హౌస్‌ఫుల్స్‌ అవుతున్నాయి. ఈ సినిమాలో కథేం లేదని నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. కేవలం స్క్రీన్‌ ప్లేని నమ్మి తీసిన సినిమా ఇది. విమర్శకులూ ఇదే విషయం చెప్పారు. నా సినిమా అనేసరికి.. కొత్త కథేదో ఉంటుందని ఆశించారు. వాళ్లంతా కాస్త నిరాశ చెందారు. రివ్యూలు బాగున్నట్టయితే వసూళ్లు మరింత బాగా వచ్చేవనేది నా ఫీలింగ్. ఈ సినిమా రిజల్ట్‌ ఏమిటన్నది ఇంకొన్ని రోజులు ఆగితే గానీ తెలీదు.

ఈ క్యారెక్టర్‌ కోసం ఎవరినైనా ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారా?

ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే యంగ్‌ గెటప్‌లో నేను చిరంజీవి గారి ఫ్యాన్‌గా కనిపిస్తాను కాబట్టి అప్పటి ‘ఘరానా మొగుడు’, ‘అల్లుడా మజాకా’ లోని చిరంజీవి గారి మేనరిజమ్స్ ట్రై చేశాను. వాటికీ  మంచి అప్లాజ్‌ వస్తోంది.

ఒక ప్యాట్రన్‌ బ్రేక్‌ చేయడానికి డిఫరెంట్‌ మూవీ చేశారు కదా! ఇలానే కంటిన్యూ అవుతారా?

గతంలో కూడా మీరు చూస్తే ‘ప్రస్థానం’ తరువాత మళ్ళీ వేరే జోనర్‌లో సినిమా చేశాను. అలాగే ‘శతమానం భవతి’ తరువాత కామెడీ జోనర్‌లో సినిమా చేశాను. ఆలా నేను ఎప్పుడూ ఒకే జోనర్‌కి ఫిక్స్‌ అవను. డిఫరెంట్‌ జోనర్‌లోనే సినిమాలు చేస్తా..

హీరోయిన్స్‌ గురించి ఏం చెబుతారు?

ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్‌ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్‌ స్టొరీలన్నింటి కంటే బెస్ట్‌ అని అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. అలాగే కాజల్‌ కూడా తన స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంది.

సినిమాలో నిర్మాణ విలువలు గురించి చెప్పండి…

సితార ఎంటర్టైన్‌ మెంట్స్‌ నుండి వచ్చే అన్ని సినిమాలు నిర్మాణ పరంగా చాలా బాగుంటాయి. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు వంశీ నాతో చాలా క్లోజ్‌ అయ్యారు. తను గత రెండు నెలలుగా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ బేనర్‌లో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. డెఫినెట్‌గా ఈ బేనర్‌లో మంచి మంచి సినిమాలు వస్తాయి. నేను మరోసారి ఈ బేనర్‌లో సినిమా చేయాలనుకుంటున్నాను..

మీ నెక్స్ట్‌ మూవీస్‌?

’96’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. సగభాగం షూటింగ్‌ పూర్తి అయింది. తరువాత ఒక అద్భుతమైన కథతో ‘శ్రీకారం’ అనే మూవీ చేస్తున్నాను. అది కూడా షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. మీ అందరూ కూడా ఆ స్టోరీని ఇష్టపడతారు. అంత మంచి స్టోరీ. తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. ఇంకా కొన్ని స్టోరీస్‌ వింటున్నాను.

Actor Sharwanand Interview | actioncutok.com

More for you: