‘బిజినెస్‌మేన్’ మహేశ్.. సరిలేరు నీకెవ్వరూ!

‘బిజినెస్‌మేన్’ మహేశ్.. సరిలేరు నీకెవ్వరూ!
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. ఈ మధ్యనే మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టి గచ్చిబౌలిలో అధునాతన ‘ఏఎంబీ’ సినిమాస్‌ను ప్రారంభించారు. తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. స్పాయిల్ కంపెనీతో కలిసి ‘ది హంబుల్ కో’ అనే క్లాత్ బ్రాండ్‌ను మహేశ్ బాబు ప్రారంభించారు. నేషనల్ హ్యాండ్ లూమ్ డే సందర్భంగా ఆగస్టు 7న హంబుల్ అండ్ కోను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. ‘‘హంబుల్ క్లాతింగ్ కలెక్షన్ నా పర్సనాలిటీ, స్టైల్ ని ప్రతిబింబించేలా ఉంటుంది. సింపుల్ గా, డౌన్ టు ఎర్త్ ఉండడానికే నేను ఇష్టపడతాను. హంబుల్ లో అదే కనిపిస్తుంది. దీని ద్వారా ఫాన్స్ తో నా బంధం మరింత దృఢపడుతుందని భావిస్తున్నాను.’’ అన్నారు.
స్పాయిల్ సీఈవో భార్గవ్ ఎర్రంగి మాట్లాడుతూ..‘‘సూపర్ స్టార్ మహేశ్‌తో కలిసి మైక్రో లెవెల్ క్లాతింగ్ బ్రాండ్ హంబుల్ కోలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మహేశ్ గారు సింప్లిసిటీ, హంబుల్ పర్సన్. ఆయన స్టైల్‌ను ఈ బ్రాండ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సోషల్ కామర్స్ బిజినెస్‌లో ఒక మంచి సెలబ్రిటీ బ్రాండ్‌గా హంబుల్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అన్నారు.
ఈ సందర్భంగా పాత్రికేయుల ప్రశ్నలకు మహేశ్ సమాధానాలు..
నిజ జీవితంలో మీరెలాంటి దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు? మీ ఫేవరెట్ స్టైల్ ఏంటి?
నేను చాలా కంఫర్ట్‌గా ఉండే దుస్తులను ధరించడానికే ప్రాధాన్యత ఇస్తాను. జీన్స్ ప్యాంట్, చెక్స్ షర్ట్‌ను ఎక్కువగా ధరిస్తుంటాను. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చేనేత కార్మికులకు పని కల్పించేలా ఉండే దుస్తులే ధరించడానికి ఎక్కువ ఇష్టపడతాను. అవే నా ఫేవరేట్.
హంబుల్ అంటే అర్థమేంటి? స్పాయిల్‌తో ఎలా అసోసియేట్ అయ్యారు?
హంబుల్ అంటే నిజాయితీగా ఉండటం, వినయంగా ఉండటం. క్లాత్ బిజినెస్‌లోకి రావాలనే ఆలోచన అని కాకుండా ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచనైతే ఉండింది. ఆ సమయంలో భార్గవ్ నన్ను కలిశారు. ఆయన విజన్ నచ్చడమే కాదు.. ఎగ్జయిటెడ్‌గా కూడా అనిపించింది.
ఏఎంబీ సినిమాస్ తర్వాత హంబుల్ స్టార్ట్ చేశారు. తర్వాత ఏం స్టార్ట్ చేయబోతున్నారు?
మనసులో చాలానే ఉన్నాయి. అయితే నా మొదటి ప్రాధాన్యం సినిమాలు. ఆ తర్వాతే ఇంకేదైనా. నా పుట్టినరోజుకి రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో నా అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి అభిమానులున్నందుకు నేనెంతో అదృష్టవంతుడిని.
మీరు బయట ఎవరి స్టైల్నైనా ఇష్టపడతారా? మీ ఫేవరేట్ స్టైల్ ఏంటి?
చూడగానే రియల్‌గా అనిపించే ఏ స్టైల్‌ను అయినా నేను ఇష్టపడతాను. నా ఫేవరేట్ కలర్ బ్లూ చెక్స్ అండ్ జీన్స్.
జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం రోజున హంబుల్‌ను స్టార్ట్ చేయడం ఎలా అనిపిస్తోంది?
చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఓ మంచి రోజున మా హంబుల్‌ను స్టార్ట్ చేయడం ఎగ్జయిటింగ్గానూ అనిపిస్తోంది. అందుకు భార్గవ్, సుశ్రితకు థ్యాంక్స్.
హంబుల్ పేరు వినగానే ఫస్ట్ మీకు ఎలా అనిపించింది?
నిజానికి భార్గవ్ వచ్చి ఆలోచన చెప్పగానే నచ్చింది. ఆయన హంబుల్ అనే పేరు చెప్పగానే కనెక్ట్ అయిపోయాను. నా పర్సనాలిటీకి దగ్గరగా ఉంటుందని ఫీలయ్యాను. హంబుల్‌లో ఎం, బి అనే అక్షరాలు పక్క పక్కనే ఉన్నాయని అనుకోలేదు. వాటిని గమనించిన మా గ్రాఫిక్స్ టీం వాటిని అండర్ లైన్ చేసింది.
‘బిజినెస్‌మేన్’ మహేశ్.. సరిలేరు నీకెవ్వరూ! | actioncutok.com
More for you: