మూడింట్లో ఏది హిట్టు.. ఏది ఫట్టు..!

మూడింట్లో ఏది హిట్టు.. ఏది ఫట్టు..!
ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడు సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఇవి ఆయా హీరోల ఫ్యాన్స్‌నూ, ఫిల్మ్ లవర్స్నూ సంబరాల్లో ముంచెత్తాయి. ఒక్కసారి ఆ అప్డేట్స్ ఏంటో ఒక లుక్కేద్దాం…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తుండగా, అంబరాన్ని చుంబిస్తున్న అంచనాలతో తయారవుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ టైటిల్ సాంగ్‌ను ఆగస్ట్ 15న ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీకి నీరాజనాలు అర్పిస్తూ రాసిన ఈ పాటకు దేవి శ్రీప్రసాద్ ట్యూన్స్ ఇచ్చారు. దేశం కోసం, దేశ ప్రజల క్షేమం కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా సమర్పించే సైనికుడి సాహసాల్నీ, అతని త్యాగాల్నీ ఈ పాటలో కీర్తించారు.
“భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడూ..” అంటూ ఈ పాట లిరిక్స్ మొదలవుతాయి. 1971 ఇండో-పాక్ వార్, 1984 సియాచిన్ యుద్ధం, 1999 కార్గిల్ వార్, 2016 సర్జికల్ స్ట్రైక్ వంటి సందర్భాల్లో మన సైనికుల విజయాల్ని సూచించే ఇమేజెస్‌ను ఈ సాంగ్‌లో చూపించి, ‘సరిలేరు నీకెవ్వరూ’ అని మన సైనికుడి శౌర్య పరాక్రమాల్ని కొనియాడారు.
పాట చివరలో ఆర్మీ దుస్తుల్లో ఉన్న మహేశ్ ఒక టెంట్‌లోంచి నడుచుకుంటూ వచ్చే విజువల్స్ చూపించి, ఆయన ఫ్యాన్స్‌ని ఆనంద డోలికల్లో ముంచెత్తారు. లహరి మ్యూజిక్, టి-సిరీస్ సంయుక్తంగా యూట్యూబ్‌లో అధికారికంగా రిలీజ్ చేసిన ఈ వీడియో సాంగ్‌కు ఒక్క రోజులో 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో ఆగస్ట్ 15న నంబర్ వన్ ప్లేస్‌లో, ప్రస్తుతం సెకండ్ ప్లేస్‌లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది.
మహేశ్, రష్మికా మందన్న జంటగా, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాప్ డైరెక్టర్ త్రివిక్రం రూపొందిస్తోన్న సినిమా టైటిల్‌ను ఆగస్ట్ 15న అఫిషియల్‌గా ప్రకటించారు. ఆ టైటిల్.. ‘అల.. వైకుంఠపురములో’. నిజానికి కొద్ది రోజులుగా ఈ సినిమాకి ‘అలకనంద’ అనే టైటిల్ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. హీరోయిన్ పూజా హెగ్డే పేరు అలకనంద కాబట్టి ఆ టైటిల్ పెట్టారనేది ఆ ప్రచార సారాంశం. అయితే అది గాసిప్ అని, ఆగస్ట్ 15న తేలిపోయింది.
‘అల.. వైకుంఠపురములో..’ అంటూ పెట్టిన ఆ టైటిల్ వీడియోను యూట్యూబ్‌లో నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో టైటిల్ వచ్చాక.. మురళీ శర్మ వైపు కొద్దిసేపు అలాగే చూసిన అల్లు అర్జున్ అక్కడి టేబుల్‌పై ఉన్న క్యారీ బ్యాగ్స్ తీసుకుంటే, మురళీ శర్మ అతని వైపు చూస్తూ “ఏంట్రోయ్.. గ్యాపిచ్చావ్” అనడుగుతాడు. బయటకు వెళ్లబోయేవాడల్లా ఆగి, “ఇవ్వలా.. వచ్చింది” అని బదులిస్తాడు బన్నీ.
సినిమాలో అతడు ఏ సందర్భంలో ఆ మాటలన్నప్పటికీ, ఆ మాటలు అతడి మునుపటి సినిమా ‘నా పేరు సూర్య’కీ, ‘అల వైకుంఠపురములో’ సినిమాకీ మధ్య తీసుకున్న గ్యాప్‌ని కూడా సూచిస్తున్నాయి. 3.2 మిలియన్ వ్యూస్‌తో ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ మూవీ కూడా 2020 సంక్రాంతినే టార్గెట్‌గా చేసుకొని రూపొందుతోంది.

ఇక మూడోది.. వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చేస్తున్న ‘వాల్మీకి’ టీజర్. తమిళ హిట్ ఫిల్మ్ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో ఫస్ట్ టైం వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ కేరెక్టర్ చేస్తుండటం గమనార్హం. తమిళ ఒరిజినల్లో బాబీ సింహా చేస్తొన్న కేరెటర్ను అతను చేస్తున్నాడు. ఫుల్ బియర్డ్, ఉంగరాల జుట్టు, కళ్లకు కాటుక, నోట్లో చుట్ట, భిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో వరుణ్ పూర్తిగా కొత్త అవతారంతో కనిపిస్తున్నాడు.
‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అధర్వ మురళి చెప్పే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఒక సందర్భంలో అధర్వ తాను తీయబోయే సినిమాలో వరుణ్‌ను హీరోగా పెట్టుకోవాల్సి వస్తుందని అర్థమవుతోంది. ఆ సినిమాలో ఇక మనవాడు ప్రదర్శించే హావభావ విన్యాసాలు ఎలా ఉంటాయో ఈ టీజర్లో మనకు చూపించాడు డైరెక్టర్. “అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్స్ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె” అని వరుణ్ తేజ్ ఇంటెన్స్ లుక్‌తో చెప్పే డైలాగ్‌తో 51 సెకండ్ల నిడివిగల టీజర్ ముగుస్తుంది.
టీజర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేశాడు హరీష్ శంకర్. వరుణ్ ఫస్ట్ మూవీ ‘ముకుంద’లో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే, మరోసారి ఈ సినిమాలో ఆయనతో నటిస్తోంది. అయితే ఆమె ఈ టీజర్లో కనిపించలేదు. అధర్వ జోడీగా నటిస్తోన్న మృణాళిని రవిని మాత్రం చూపించారు. ఒక రోజులో ఈ టీజర్‌కు 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సెప్టెంబర్ 13న రిలీజవుతోన్న ‘వాల్మీకి’తో వరుణ్ తేజ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
మూడింట్లో ఏది హిట్టు.. ఏది ఫట్టు..! | actioncutok.com
More for you: