తెలంగాణకు కొత్త గవర్నర్!


తెలంగాణకు కొత్త గవర్నర్!

తెలంగాణకు కొత్త గవర్నర్!

సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేస్తూ వచ్చిన ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌కు స్థాన చలనం కలుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనను జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా బదిలీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రస్తుతం జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యపాల్ మాలిక్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ఢిల్లీ సమాచారం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. నరసింహన్ 2009 డిసెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా నియమితులైన ఆయన, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చినా తన పదవిని నిలుపుకోవడం విశేషం.

తెలంగాణకు కొత్త గవర్నర్! | actioncutok.com

More for you: