శర్వానంద్‌కు చిరంజీవి చెప్పిన మాటేమిటి?


శర్వానంద్‌కు చిరంజీవి చెప్పిన మాటేమిటి?

శర్వానంద్‌కు చిరంజీవి చెప్పిన మాటేమిటి?

నటనలో శర్వానంద్‌కు ఇన్‌స్పిరేషన్ చిరంజీవి. “ఆయన చెప్పిన ఒక గొప్ప లైన్ ఎప్పటికీ మర్చిపోలేను.. ‘నీ సంకల్పం గొప్పదైతే, దేవుడు నీ తలరాతను తిరగరాస్తాడు’. ఆ ఒక్క లైన్ నాపై చాలా గాఢమైన ముద్ర వేసింది. నీ సకల్పం కరెక్టుగా ఉంటే ఏదైనా సాధించగలుగుతావ్ అంటారాయన. 2005.. ప్రాంతంలో వాళ్లింట్లో ఆయన నాతో చెప్పిన మాట అది” అని చెప్పాడు శర్వానంద్.

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ఒక చిన్న కేరెక్టర్‌లో చిరంజీవితో కలిసి నటించే అవకాశం శర్వానంద్‌కు లభించింది. హాస్పిటల్‌లో ఒక పేషెంట్‌గా శర్వా కనిపిస్తాడు.

“అది చేసే అవకాశం ఆయన వల్లే వచ్చింది. ఒకసారి డబ్బింగ్ థియేటర్ దగ్గరకు వెళ్తే.. చిరంజీవి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కిరణ్ గారు, డైరెక్టర్ జయంత్ గారు అక్కడ కూర్చొని ఉన్నారు. జయంత్‌కు ‘ఈ బాబుని ఆ రోల్‌కు చూడండి’ అని చిరంజీవి గారు సూచించారు. తర్వాత కలవమని జయంత్ చెప్పారు. ఆ తర్వాత రెండు నెలలు ఆయనను కలవడానికి ట్రై చేశా. కుదరలేదు. ఆ తర్వాత షూటింగ్ జరుగుతున్న ప్లేస్ నుంచి చిరంజీవి గారు మాట్లాడతారంటూ ఫోన్ వచ్చింది. ‘ఏంటీ.. నువ్వు జయంత్‌ని కలవలేదా?’ అని ఆయన అడిగారు. ‘ట్రై చేశాను. చెప్తానన్నారు కానీ చెప్పలేదు’ అని చెప్పాను. ‘రేపట్నుంచీ షూటింగ్. వచ్చేయ్’ అన్నారు. అలా వచ్చింది ఆ ఛాన్స్” అంటూ చెప్పుకొచ్చాడు శర్వా.

శర్వానంద్‌కు చిరంజీవి చెప్పిన మాటేమిటి? | actioncutok.com

More for you: