‘రాక్షసుడు’ హిట్టవడం సాయిశ్రీనివాస్ కంటే నాకే ఎక్కువ ఆనందంగా ఉంది: వి.వి. వినాయక్


'రాక్షసుడు' హిట్టవడం సాయిశ్రీనివాస్ కంటే నాకే ఎక్కువ ఆనందంగా ఉంది: వి.వి. వినాయక్

‘రాక్షసుడు’ హిట్టవడం సాయిశ్రీనివాస్ కంటే నాకే ఎక్కువ ఆనందంగా ఉంది: వి.వి. వినాయక్

“నేను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సాయి శ్రీనివాస్ కి ఈ రోజు ‘రాక్షసుడు’తో హిట్ రావడం అనేది సాయి కన్నా నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది. దానికి కారణమైన రమేష్ వర్మకి అభినందనలు” అని చెప్పారు అగ్ర దర్శకుడు వి.వి. వినాయక్. యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా ఏ స్టూడియోస్‌, ఎ హవీష్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ప్రముఖ విద్యావేత్త కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘రాక్షసుడు’. అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగాఆగస్ట్‌ 2న విడుదల చేశారు. సూపర్‌ హిట్‌ టాక్‌తో సినిమా సక్సెస్‌పుల్‌గా రన్‌ అవుతున్న సందర్భంగా వినాయక్ మీడియాతో మాట్లాడారు..

“మల్టీ డైమెన్షన్ వాసు గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అలాగే ఈ సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు నాకు మంచి సన్నిహితుడు. చాలా గొప్ప వ్యక్తి. వాళ్లబ్బాయి హీరో అయ్యుండి కూడా ఈ కథకు సాయి అయితే పర్ఫెక్ట్ అని సాయిని ఎంచుకోవడం నిజంగా గొప్ప విషయం. అలాగే సినిమాకు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాకు ఏది అవసరమో అన్ని సమకూర్చి ఒక సూపర్ హిట్ సినిమా చేశారు. అందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.

అందరూ రీమేక్ చేయడం సులభం అనుకుంటారు. కానీ రీమేక్ చాలా కష్టం. ‘రాక్షసుడు’ తమిళ్ వెర్షన్ నేను చూశాను. ఆ సినిమాలో లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఎక్కడా టెంపో మిస్ అవకుండా రమేష్ వర్మ చాలా జాగ్రతగా తెరకెక్కించారు. ఒక సందర్భంలో రమేష్ వర్మని ‘డైరెక్షన్ వైపు ఎందుకు వచ్చావు?’ అని అడిగాను. దానికి అతను ‘దాదాపు 800 సినిమాలకు డిజైనర్ గా పనిచేసి బోర్ కొట్టి వచ్చాను సర్’.. అని చెప్పాడు. ఆ సమాధానం నాకు బాగా నచ్చింది. కొంతకాలానికి ఏ పనైనా బోర్ కొడుతుంది. కానీ అతనికి దర్శకత్వం బోర్ కొట్టదు. ఈ బ్యానర్లో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. రమేష్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి. అలాగే సాయితో ఇలాంటి మంచి సినిమాలు తీయాలి. వీరిద్దరిది మంచి కాంబినేషన్. సాయికి ఇంకా మంచి సూపర్ హిట్ లు రావాలని మనస్ఫఊర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వినాయక్ చెప్పిన విషయాలు…

– ‘అల్లుడు శీను’ సినిమాలో సాయిని ఒక కమర్షియల్ హీరో గా చూపించడానికి అవసరమైన అన్ని యాంగిల్స్ చూపించాను. కొన్ని అవసరం లేకపోయినా కథలోకి తీసుకువచ్చి హీరోయిజంని ఎలివేట్ చేసాం. అది ఒక మ్యాజిక్. అది వర్కవుట్ అయింది. మొన్న బెల్లంకొండ సురేష్ గారు మాట్లాడుతూ ‘మా అబ్బాయి ని ఆర్టిస్టుగా ఈ సినిమాతోనే గుర్తించారు’ అన్నారు. అది నిజం కాదు. సాయిని అన్ని సినిమాల్లోనూ మంచి ఆర్టిస్టుగా గుర్తించారు. లేకపొతే అన్ని సినిమాలు చేయలేడు. సాయి తన ఫస్ట్ సినిమాకే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి సినిమా టెంపో ఎక్కడా తగ్గకుండా కథలోకి వెళ్లి నటించాడు. సాయి ఎలాంటి పాత్రని అయినా చేయగలడు. ఫ్యూచర్ లో ఇంకా మంచి పాత్రల్లో కనిపిస్తాడు.

– సాయి ఫస్ట్ నుండి చాలా మెచ్యూర్డ్ గా ఉండేవాడు. అలాగే ప్రతి సినిమాకు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. అప్పటికి ఇప్పటికి అతనిలో నేనైతే పెద్దగా తేడాలేమీ గమనించలేదు. కథకు ఎలా కావాలో అలా చేస్తున్నాడు.

– ఫ్యూచర్ లో  తప్పకుండా సాయితో సినిమా తీసే అవకాశం ఉంది. కాకపోతే ఒక పెద్ద సినిమా తీయాలి. దానికి మంచి కథ సెట్ అవ్వాలి.

‘రాక్షసుడు’ హిట్టవడం సాయిశ్రీనివాస్ కంటే నాకే ఎక్కువ ఆనందంగా ఉంది: వి.వి. వినాయక్ | actioncutok.com

More for you: