‘పరమానందయ్య శిష్యులు’ (1950) చిత్రంలో కులనింద డైలాగ్

‘పరమానందయ్య శిష్యులు’ (1950) చిత్రంలో కులనింద డైలాగ్
అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీరాజ్యం జంటగా నటించిన ‘పరమానందయ్య శిష్యులు’ (1950) సినిమాలో కులనింద చోటు చేసుకుంది. అందులో నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా ఓ డైలాగ్ పెట్టారు. ఒక పాత్రచేత మంగలి వెంకడు లమ్డీకొడుకు పొదేసుకుని ఎదురుగా ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే అనుకున్నా పని కాదనిష అని చెప్పించారు. ఇది నాయీ బ్రాహ్మణులను నీచంగా నిందించే డైలాగ్ అంటూ అప్పట్లో నాయీ బ్రాహ్మణులు నిరసనలు వ్యక్తం చేశారు. కస్తూరి శివరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి కథతో పాటు మాటలు, పాటలు కూడా ప్రసిద్ధ రచయిత తాపీ ధర్మారావు రాశారు. ఆయన ఇలాంటి డైలాగ్ రాయడం ఊహాతీతమైన విషయం.
ఏలూరుకు చెందిన పోతునూరు రామచంద్రరావు ఈ విషయాన్ని ఆంధ్రపత్రికకు రాసిన ఓ లేఖలో ఎత్తిచూపారు. “కులమతరహితమైన సమాజ నిర్మాణం కోసం, సర్వసమత్వం కోసం పాటుబడుతున్న ఈ రోజులో ఇలాంటి కులనింద సమంజసమా? తాపీ ధర్మారావునాయుడు గారికి, తమ పత్రికలో చెప్పే శ్రీరంగనీతులు, ఈ సంభాషణ వాక్యం వ్రాసేటప్పుడు గమనానికి రాలేదా? ఆ నిర్మాతా, ఆ రచయితా తమ కులంకాని వాళ్లను అవహేళన చేయడమే ముఖ్యంగా యెంచుకొన్నారని అనుకొన్నా, ఇట్లాంటి అసభ్యతలు లేకుండా చూడవలసిన సెన్సారువారు ఈ నిందను యెల్లా ఉండనిచ్చారో ఊహాతీతంగా ఉంది. ఈ విషయంలో అధికారులు తగు చర్య తీసుకోవాలని కోరుతున్నాను.” అని ఆయన ఆ లేఖలో రాశారు.
ఆంధ్రపత్రిక డైలీలో 1950 అక్టోబర్ 10న ఈ లేఖను ప్రచురించారు.
‘పరమానందయ్య శిష్యులు’ (1950) చిత్రంలో కులనింద డైలాగ్ : actioncutok.com
More for you: